Home > Politics > పోలవరం మేము వడ్డించిన విస్తరి : రఘువీరా రెడ్డి

పోలవరం మేము వడ్డించిన విస్తరి : రఘువీరా రెడ్డి

నిరంతర విద్యుత్ తో రైతుకు నష్టం: వీహెచ్
రజనీ పార్టీ కోసం క్యూ కడుతున్నారు

raghuveera-reddy-apduniaకాంగ్రెస్ కేంద్రంలొ అధికారంలో ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ను 2018 కల్లా పూర్తి చేసేవాళ్ళమని ఏపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఆదివారం నుంచి కాంగ్రెస్ పార్టీ ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు పాదయాత్ర చేయనున్న నేపధ్యంలో శనివారం ఇంద్రకిలాద్రి పై ఘాట్ రోడ్డు నుండి కాలినడికన అమ్మవారిని అయన దర్శించుకున్నారు. పోలవరాన్ని అమ్మవారే కాపాడాలని ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద వందకొబ్బరి కాయలు కొట్టారు. అమ్మావారి దర్శనం తరువాత అయన మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి పదవ తేదీవరకు ధవళెశ్వరం నుండి పోలవరం వరకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నాం. 10 న పోలవరంలో సామూహిక సత్యాగ్రహం వుంటుందని అయన అన్నారు. కేంద్ర ప్రభుత్వనిధులతో పోలవరం పూర్తి కావాలని, పొలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లక్ష్యాలను తెలియచేయడమే లక్ష్యం గా పాదయాత్ర జరుగుతుందని అయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు అన్నది మేము వడ్డించిన విస్తరి. దాన్ని కుక్కలు చింపిన విస్తరలా మార్చేశారని అయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ పాదయాత్రను విజయవంతం చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించాలని అమ్మవారిని వేడుకున్నామని రఘువీరా అన్నారు. ఐదు కోట్ల ప్రజల అకాంక్ష నెరవేరేంతవరకు కాంగ్రెస్ పొరాడుతోందని అయన అన్నారు.

తాంత్రిక పూజలపై స్పందించిన రఘువీరా
ఇంద్రకీలాద్రి పై పూజలు జరిగాయని దుర్గగుడి చైర్మన్ ఒప్పుకున్నారు. అధికారులతో మాట్లాడుదామంటే భయపడిపోతున్నారు. దుర్గమ్మ సన్నీధిలొ ఎవ్వరూ అబద్దాలు ఆడలేరు…అలాగని నిజం చెప్పాలంటే నోటికి తాళాలు వేస్తున్నారని అయన అన్నారు. టిడిపి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా దుర్గగుడి లో ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంది. గతంలో అమ్మవారి ముక్కపుడక విషయంలో ప్రభుత్వం మూల్యం చెల్లించుకొందని అయన గుర్తు చేసారు. ఆలయంలో పాలక మండలి నొరు మెదపకూడదని టిడిపి నేతలు హుకుం జారీ చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని అయన వ్యాఖ్యానించారు. భక్తుల మనోబావాలు దెబ్బతినకుండా ఎవరిపై చర్యలు తీసుకుంటారో ఎండొమెంట్, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. పూజలు జరిగాయనేది వాస్తవం…జరగలేదని బుకాయించొద్దు….సిట్డింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com