Home > Editorial > రాహూల్ రాటుదేలుతున్నారు….

రాహూల్ రాటుదేలుతున్నారు….

వైట్ ఎలిఫెంట్స్ గా ఐఐటీలు
పెద్ద నోట్ల రద్దుకు ఏడాది

Meeting with Fishermens Congressప్రత్యామ్నాయ వ్యూహంలేని రాహుల్ ఆయన తన ప్రసంగాలలో ప్రధాని మోడీని, ఆయన విధానాలను ఉద్దేశించి వాడిన పదునైన పదజాలం జనాన్ని బాగా ఆకర్షించింది. ఉదాహరణకు ఆయన తన ప్రసంగాలలో విసిరిన ‘గబ్బర్ సింగ్‌పన్ను’, ‘జాదూగర్ సింగ్ పన్ను’, ‘మోడీ చేసిన విపత్తు’ వంటి పదజాలాలు ప్రజలను ఆకర్షించాయి. మోడీ తరహలోనే ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ఆకట్టుకొన్నాయి. సోషల్ మీడియా ధోరణులను గమనిస్తే ఆయన హవా నడుస్తున్నట్లే ఉంది. మోడీ తీసుకున్న రెండు పెద్ద ఆర్థిక చర్యలుపెద్దనోట్ల రద్దు, సరకులు- సేవలపన్నుని రాహుల్ ప్రధానంగా విమర్శిస్తున్నారు. వాటిని ‘జంట టార్పెడోలు’గా ఆయన అభివర్ణించారు. అయితే మోడీ ప్రభుత్వ ఆర్థిక విధాన లోపాలను తిప్పికొట్టేందుకు జాగ్రత్తగా రూపొందించిన ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గ పటం ఏమైనా రాహుల్ వద్దగాని, కాంగ్రెస్ వద్ద గాని ఉందా అంటే లేనట్లే. రాహుల్ గాంధీ ప్రసంగాలలో కూడా ఆ ప్రస్తావన లేదు. అలాగే బిజెపిపై కాంగ్రెస్ విమర్శలలో కూడా ఆ మాట లేదు. మోడీ ప్రభుత్వ చర్యలను ఎండగట్టడానికే రాహుల్ ప్రసంగాలు పరిమితమయ్యాయి. కానీ పరిష్కారాలను, ప్రత్యామ్నాయ ఆలోచనలను రాహుల్ సూచించడం లేదు. ఆయన అలా చేస్తే ఓటర్ విశ్వాసాన్ని తప్పక చూరగొంటారు దేశ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థలో అది అతి పెద్ద సంస్కరణగా చెప్పబడుతోంది. రాహుల్, కాంగ్రెస్ దాని అమలు తీరును ముందునుంచీ విమర్శించారు.అనేక విధాల పన్నుల రేట్లు, అమలు లోపాలూ కలిసి ఆ వ్యవస్థను ‘ఒకే దేశం-ఒకేపన్నుల వ్యవస్థ’ లక్షానికి దూరంగా తీసుకుపోయినట్లు ఆ విమర్శలు సాగాయి. జిఎస్‌టి ప్రవేశపెట్టిన తీరు అసలు సరిగాలేని మాట వాస్తవమే. సరైన ప్రణాళిక లేకుండా, ఎదురయే సవాళ్ల పట్ల అవగాహన లేకుండా దీనిని తెచ్చారనడానికి తరచూ చేస్తున్న పన్నుల రేట్ల మార్పులే ఉదాహరణ. అమలులోకి వచ్చిన నాలుగు నెలలకే ఏన్నోసార్లు ఆ మార్పులు చేశారు. అనేక పన్నుల రిటర్న్ దాఖలు ఆచరణ సాధ్యం కాదని చిన్న వ్యాపారులు వాపోవడమే అందుకు కారణం.అలాగే వారు జిఎస్‌టి వల్ల తమ వ్యాపారాలు దారి తప్పాయని నిస్పృహ చెందారు. ఒక ఉత్పత్తి తయారీకి వాడే వేర్వేరు ముడి పదార్థాలపై వేర్వేరు పన్నుల రేట్లు ఉండడంతో గందరగోళం నెలకొన్నట్లు వారు విమర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా జిఎస్‌టిపై వ్యాపారుల ఆందోళనలు అధికమయ్యాయి. ప్రభుత్వం జిఎస్‌టి పన్నుల రేట్లను తగ్గిస్తూ ఇటీవల ప్రకటన చేసిన తర్వాత కూడా ఈ ఆందోళనలు నిమ్మళించలేదు. అయితే కాంగ్రెస్ ఈ విషయంలో వేరు గా చేసేది ఏమిటి? అది అధికారంలో ఉంటే తీసుకువచ్చే మార్పులు ఎలా ఉంటాయి? అన్న ప్రశ్నలకు రాహుల్‌గాంధీ ప్రసంగాల్లో సమాధానాలు లేవు.2019లో అధికారంలోకి వస్తే జిఎస్‌టి రేట్లను ఒకే స్లాబ్‌లో 18శాతం ఉండేలా తగ్గిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. భారతదేశం వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల విస్తృతదేశంలో రాహుల్ ఇచ్చిన హామీ ఊహల్లో బాగానే ఉంటుందిగాని, దానిని ఆచరణలో పెట్టడం సాధ్యం కాదని చాలాసార్లు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానించారు. విలాస వస్తువులు, అత్యవసర సరకులు అన్నిటినీ ఒకే గాటకు కట్టి ఏక పన్ను రేటును అమలులో పెట్టడం చాలా కష్టమని కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కూడా సూచించారు. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం సారథ్యంలో నియమించిన బృందం కూడా 3రకాల పన్నుల రేట్లు ఉండే జిఎస్‌టి వ్యవస్థనే సూచించింది.చిన్న దేశాలలోవలే కాకుండా ‘ఒకే రేటు జిఎస్‌టి’ మనవంటి పెద్దదేశంలో ఆచరణ సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. రాహుల్ గాంధీ తోచినట్లుగా ఏవో ప్రకటనలు చేయడం కాకుండా ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రణాళికతో ముందుకు రావలసిన ఆవశ్యకత కనిపిస్తోంది. ముఖ్యంగా జిఎస్‌టి ఎలా అమలు చేయాలి అన్న విషయమై ప్రత్యామ్నాయ ప్రణాళికను సూచించాలి. జిఎస్‌టి అన్నది వ్యాపారులపట్ల, వినియోగదారులపట్ల ‘పన్నుల టెర్రరిజం’ కాకుండా ఉండడానికి ఏమి చేయాలి అన్నది రాహుల్ స్పష్టంగా చెప్పాలి. ఆయన ప్రసంగాల్లో ఇది ఇంతవరకూ లోపించింది. నోట్లరద్దు, ఆర్థిక వ్యవస్థపై అది మూడు రకాలుగా చూపిన విరుద్ధ ప్రభావం, నల్లధనాన్ని కనుగొని, రూపుమాపడం లో అది విఫలమైన తీరుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా రాహుల్ తదితర కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే మోడీని చాలినంతగా విమర్శించారు. అన్ని రాజకీయ ర్యాలీల్లో రాహుల్ గాంధీ ప్రముఖంగా చేసిన విమర్శ ‘నోట్ల రద్దు విషాదం’ అని చెప్పకతప్పదు. నోట్లరద్దు అర్థవంతమైన సత్ఫలితం ఏదీ సాధించలేదని అనడం యదార్థమే. ఆ విమర్శ చేయడం ద్వారా రాహుల్, ఇతర కాంగ్రెస్ నాయకులు సరియైన తీరులోనే స్పందించారు. అయితే నోట్ల రద్దు ద్వారా మోడీ రూపుమాపాలనుకున్న నల్లధనం విషయంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పథకం ఏదైనా ఉంటే దానిని రాహుల్ స్పష్టం చేయాల్సి ఉంది. సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితమైన మార్గపటంతో రాహుల్‌గాంధీ సిద్ధంగా లేకపోవడం కూడా తప్పిదమే. మన ఆర్థిక వ్యవస్థతో తక్షణ పరిష్కారాలు అవసరపడే వేరే సమస్యలు కూడా ఉన్నాయి. వ్యవసాయ సంక్షోభం, బ్యాంకింగ్ రంగంలో అవకతవకలు, పెరుగుతున్న నిరుద్యోగం వంటివి తక్షణం దృష్టిపెట్టాల్సిన తీవ్ర సమస్యలు. రాజకీయ దుష్ప్రచారాలకు, వ్యక్తిగత దూషణలకు దిగకుండా విధాన నిర్ణేతలు అసలైన పరిష్కార మార్గాలను రూపొందించాల్సిన అవసరం మన ఆర్థిక వ్యవస్థకు ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, రాహుల్ గాంధీ సరియైన ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహంతోనే మోడీని ఢీ కొనాలి తప్ప కేవలం పదడాంబికాలతో కాదు. సామాజిక మాధ్యమంలో పోస్టు లు, వ్యాఖ్యలు కాకుండా నిర్దిష్టమైన సూచనలతో రాహుల్ ముందుకు రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *