Home > World News > National > రెయిన్ బో విలేజ్

రెయిన్ బో విలేజ్

పేద్ద.... బ్రిడ్జిను ప్రారంభించిన మోడీ
అప్ డేట్ కాకపోతే... పింక్ స్లిప్పులే
 
rainbow-village_apduniaఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది… సారీ ఇదేదో సెల్ ఫోన్ స్లోగన్ అనుకునేరు… కానేకాదు… ఒక ఐడియా ఓ గ్రామ స్వరూపాన్ని మార్చేసింది. ఎంతలా అంటే ప్రస్తుతం ఆ గ్రామం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటారా… తెలుసుకుందాం పదండి…ఎటుచూసినా అపరిశుభ్ర వాతావరణం.. మురుగునీరు.. పాడుబడిపోయినట్లు ఉన్న ఇళ్లు.. ఇదంతా ఇండోనేషియాలోని ఓ గ్రామంలో పరిస్థితి. మరి ఈ దృశ్యం చూశారా… ఈ రెండు దృశ్యాలు ఒకటే… అందవిహీనంగా ఉన్న ఈ గ్రామమే ఇప్పుడు ఇలా మారిపోయింది…ఇంధ్రధనస్సు పొరపాటున ఈ ఇళ్ల మీద వాలిందేమో అనిపిస్తోంది కదూ… ఈ రంగు రంగుల ఇళ్లు ఇప్పుడు పర్యాటకులను విపరీతంగా ఆకర్షించేస్తున్నాయి.ఇండోనేషియాలోని కాంపుంగ్‌ పెలాంగి గ్రామం ఇంధ్రధనస్సును కప్పుకున్నట్లు ఉంటుంది. ఓ వినూత్నమైన ఆలోచనతో ఇక్కడి ఇళ్లన్నీ ఇలా అందంగా ఆకర్షణీయంగా మారిపోయాయి. ఇక్కడి హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ స్లామెట్‌ పరిస్థితిని మార్చేందుకు పథకాన్ని ప్రభుత్వం ముందు పెట్టారు. అందుకు అంగీకరించిన ప్రభుత్వం దాదాపు రూ.14 లక్షలు ఖర్చు చేసి ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లకు రెడ్‌, యల్లో, గ్రీన్‌, పర్పుల్‌, బ్లూ కలర్స్‌ వేయించింది. ప్రతి ఇంటికి కనీసం మూడు రంగులైన ఉంటాయి. గోడలపై ఆకర్షించే విధంగా చిత్రీకరించిన బొమ్మలతో ఆ ప్రాంతం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ బొమ్మలు పర్యాటకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దాంతో వాటి దగ్గర నిలబడి ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తున్నారు. ఈ గ్రామం ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంలో అవి కాస్తా వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు అందరూ ఈ గ్రామాన్ని రెయిన్‌బో విలేజ్‌ అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *