Home > Politics > రోహింగ్యా వారివల్ల దేశానికి ముప్పు: రాజ్ నాథ్

రోహింగ్యా వారివల్ల దేశానికి ముప్పు: రాజ్ నాథ్

నవంబర్ లో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం 
అసంతృప్తి సెగ!

raj-nath-singh-apduniaభారత్ లోకి ప్రవేశించిన రోహింగ్యా ముస్లింలు శరణార్థులు కాదని… వారంతా అక్రమ వలసదారులేనని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసారు. వారిని తిరిగి మయన్మార్ కు పంపించేయాలనే కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. రొహింగ్యా ముస్లింలు భారతదేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారన్నారు. వారిని తప్పనిసరిగా వెనుకకు పంపించేయాలన్నారు. మానవ హక్కులను సాకుగా చూపిస్తూ చట్ట విరుద్ధ వలసదారులను శరణార్థులుగా పేర్కొనకూడదన్నారు. రోహింగ్యాలను వెనక్కి పిలిపించుకోవడానికి మయన్మార్ సిద్ధంగా ఉన్నప్పటికీ, మన దేశంలోని కొందరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.

ఎవరైనా శరణార్థిగా దేశంలో ప్రవేశించాలంటే ఓ ప్రక్రియ ఉంటుందని, రోహింగ్యాలు ఆ ప్రక్రియను పాటించలేదని రాజ్ నాథ్ తెలిపారు. మతపరమైన అణచివేతకు గురవుతారనే భయం ఉన్న దేశానికి శరణార్థులను తిప్పి పంపించరాదన్న సిద్దాంతం కేవలం భారతదేశంలో ఆశ్రయం పొందినవారికి మాత్రమే ఉంటుందని వివరించారు. రొహింగ్యా ముస్లింలు ఇప్పటి వరకు భారతదేశంలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు.

1951 ఐక్యరాజ్యసమితి శరణార్థి ఒప్పందంలో భారత్ చేరలేదని… ఈ నేపథ్యంలో, రోహింగ్యాలను మయన్మార్ కు తిప్పి పంపడం ద్వారా భారత్ ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడం లేదని అన్నారు. మరోవైపు, రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పుగా మారారని, ఈ కారణం వల్లే వారిని మయన్మార్ కు తిప్పి పంపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర హోం శాఖ సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *