Home > Movies > జీఎస్టీ 2 కు వర్మ రెడీ

జీఎస్టీ 2 కు వర్మ రెడీ

సైరా మళ్లీ రీ షూట్
షకీలా 250 వ చిత్రం 'శీలవతి' ఫస్ట్‌లుక్‌ విడుదల

gst-miya-malkova-apduniaఇప్పటిదాకా జరిగిన రచ్చ చాల్లేదనుకున్నాడేమో.. మరోసారి హీట్ పెంచడానికి రెడీ అవుతున్నాడు. కాంట్రవర్శీ సీక్వెల్‌ కి రెడీ గా వుండండి అంటూ పిలుపునిస్తున్నాడు. ఎప్పటికైనా ఆస్కార్‌ రేంజ్‌ కు తెలుగోడు చేరుకుంటాడా అన్న సందేహాలు తీరతాయో లేదో కానీ.. ఓ తెలుగు డైరెక్టర్‌ వరల్డ్ నెంబర్‌ వన్ ట్రెండింగ్ వీడియో తీయగలడని నిరూపించుకున్నాడు.  అదే రేంజ్‌ లో కాంట్రవర్శీలను వాడుకోవడం లోనూ నెంబర్‌ వన్‌ అని ప్రూవ్‌ చేసుకున్నాడు. మరి ఈ సీక్వెల్ స్టోరీ ఏంటి అనేది పెద్ద డౌట్‌.విషయంలోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో వర్మ అంటే కంటెంట్‌ ఏదైనా గానీ కాంట్రవర్శీ చేసి తీరాల్సిందేనన్నంతగా వాతావరణం వేడెక్కడం చూసాం. ఇది గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ విషయంలో ఇంకా పీక్స్‌ కు చేరుకుంది. ఓ పోర్న్‌ స్టార్‌ తో సెక్స్‌ ఫిలాసఫి చెప్పించడం మహిళా సంఘాలను మండిపడేలా చేసింది. దానికి తోడు ఈ రెండున్నర నిమిషాల ఫిల్మ్‌ స్క్రిప్ట్‌ కాపీ కొట్టాడంటూ జయకుమార్‌ అనే రైటర్‌ మీడియా కెక్కి ఏకంగా వర్మను హోమోసెక్సువల్‌ అనే రేంజ్‌ వెళ్లిపోయాడు. ఇంత రచ్చ జరిగాక అనుకున్నట్టే ఫిల్మ్‌ విడుదలయింది.. యూట్యూబ్‌ క్రాష్‌ అయ్యే రేంజ్‌లో ట్రాఫిక్‌ తెచ్చుకుని ట్రెండింగ్‌ లో వరల్డ్ నెంబర్‌ వన్‌ అనిపించుకుంది. ఇదే జోష్ ను కంటిన్యూ చేస్తూ GST 2 తీస్తానని ట్వీట్ చేసాడు వర్మ. మరి దీనిపై రచ్చ జరుగుతుందో లేదంటే వాడు చావు వాడు చస్తాడని వదిలేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *