Home > Crime > అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు

అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు

వదలని పాతకేసులు
గోదాదేవి వివాదంపై మద్రాస్ హైకోర్టు స్టే

rape-attempt-apduiniaసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఒక గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వితంతువు అయిన అత్తపై ఆమె అల్లుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కూలి పనికి వెళ్లిన అత్తను ఇంటికి తీసుకెళ్లడానికి బైక్ లో వెళ్లిన అల్లుడు మార్గమధ్యంలో బైక్ ను ఆపాడు. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె నిరాకరించడంతో దాడికి పాల్పడి అత్యాచారం చేశాడు.అనంతరం రాత్రి ఏడుగంటలప్పుడు ఆమెను అతడే ఇంటికి తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడిన వ్యవహారం గుట్టుగా ఉండిపోతుందని అనుకున్నాడో ఏమో కానీ.. ఆమె మాత్రం విషయాన్ని తన కుమారులకు చెప్పింది. అల్లుడిపై దౌల్తాబాద్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కూలి పని ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లడానికి కొడుకుకు ఆమె ఫోన్ చేసిందని, అయితే అల్లుడు వచ్చాడు కాబట్టి కొడుకును రావొద్దని చెప్పి.. ఆమె బైక్ ఎక్కి వెళితే.. అతడు ఇలాంటి పని చేశాడని బాధితురాలు వాపోయింది.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *