Home > Crime > వైజాగ్ లో మతిస్థిమితం లేని యాచకరులిపై రేప్

వైజాగ్ లో మతిస్థిమితం లేని యాచకరులిపై రేప్

తమిళనాడులో కాల్ మనీ..కుటుంబం ఆత్మహత్య
సీబీఐ కోర్టుకు హజరయిన జగన్, గాలి జనార్ధన రెడ్డి

rape-on-begger-apduniaసభ్య సమాజం మరోసారి తలదించుకుంది. మద్యం తాగిన మత్తులో ఓ యువకుడు, పట్టపగలు, నడిరోడ్డుపై ఉన్న యాచకురాలిపై అత్యాచారం చేస్తుంటే, అతన్ని నిలువరించాల్సిన ప్రజలు వినోదం చూస్తూ ఉండిపోయారు. కొందరు ఆనందంగా వీడియోలు తీసుకున్నారు. ఈ ఘటన విశాఖపట్నం, శ్రీనివాస కల్యాణమండపం రోడ్డులో జుగుప్స కలిగించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్టేషన్ పరిసరాల్లో అడుక్కుంటూ జీవిస్తున్న ఓ మతిస్థిమితం లేని యువతిపై, రైల్వే న్యూ కాలనీకి చెందిన గంజి శివ (25) మద్యం తాగి వచ్చి ఆమెపై అత్యాచారానికి దిగాడు. అటుగా వెళుతున్నవారు ఈ ఘటనను చూశారే తప్ప, ఎవరూ అడ్డుకోలేదు. అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ అర్జి శ్రీను ఘటనను వీడియో తీస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆపై గంజి శివను అరెస్ట్ చేశామని, బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *