Home > Bhakti > రథసప్తమికి సిద్ధమవుతున్న తిరుమల

రథసప్తమికి సిద్ధమవుతున్న తిరుమల

తిరుమలపైనా గ్రహణం ఎఫెక్ట్
టీటీడీ ఛైర్మన్ గా రాఘవేంద్రరావు...

rathasapthami-tirumala-apduniaతిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు టీ.టీ.డీ సిద్దమైంది. 24 వ తేదీ తెల్లవారు జాము నుండి సాయంత్రం వరకు ఈ వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగ నున్నాయి. శ్రీమలయప్ప స్వామి అవతారంలో వెంకన్న స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. ప్రతి రెండు గంటలకు ఓ వాహనంపై విహరిస్తూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. సకల చరాచర జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు. మాఘశుద్ధ సప్తమి నాడు అదితి, కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. ఆ రోజునే సప్తాశ్వా రథారూఢుడై ప్రపంచానికి దర్శనమివ్వడంతో రథసప్తమిగా వేడుకలను నిర్వహిస్తారు. రథంలోని భాగాలు సమయాన్ని, రుతువులకు చిహ్నాలుగా భావిస్తారు. ఉత్తరదిశవైపు సూర్యుడి ప్రయాణం ప్రారంభమవుతుంది. దైవారాధనలో సూర్యుని ఆరాధనకు విశిష్టమైన స్థానముంది. ప్రత్యక్షంగా సూర్యుడు దర్శనమిస్తాడు. సూర్యుని వెలుగులు లేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది.

వ్యవసాయానికి, మానవులకు, జంతువులకు, ఇతర జీవజాలానికి సూర్యకిరణాలే ఆధారం. సూర్యరశ్మి లేని ప్రపంచాన్ని ఊహించలేం. అసలా ఊహే భయానకంగా ఉంటుంది. ఇదిలాఉంటే సూర్యనమస్కారాలు చేయడం ఆరోగ్యరీత్యా కూడా మంచిది. పరిశోధనలు సైతం ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని అగస్త్యమహర్షి అనుగ్రహం చేత పొంది రావణ సంహారం చేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. మహాభారతంలో మహాబలుడిగా పేరొందిన కర్ణుడు సూర్యానుగ్రహం వల్లే కుంతికి జన్మించాడు. మణులలో విశిష్టమైన శమంతకమణిని సత్రాజిత్తు సూర్యుని ఆరాధనతో పొందాడు. సూర్యుడికి అంతటి విశిష్టత ఉంది. కలి వైవస్వత మన్వంతరంలో మొదటి తిథి రథసప్తమి. ఈ పర్వదినాన జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులను తలపై ఉంచి అభ్యంగనస్నానం చేయిస్తారు. ఆదిత్యుని ఆరాధన మానవులను పునీతం చేస్తుందని హిందువుల విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *