Home > Bhakti > తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం

తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం

పాలక మండలి దిశగా టీటీడీ అడుగులు
రుద్రాక్షలు- విశిష్టత ఏంటో తెలుసా

rathasapthami-apduniaతిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే రథసప్తమి వేడుకలను జరిపేందుకు టీ.టీ.డీ సిద్దమైంది. 24వ తేదీ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఈ వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతి రెండు గంటలకు ఓ వాహనంపై… రోజు మొత్తం సప్త వాహనాలపై స్వామి దర్శనమిస్తారు. ఈ ఒక రోజు ఉత్సవం వైభవంగా జరపటానికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ ఉత్సవం, ఏ వేడుక, ఏ ఊరేగింపులు జరిగినా అది వైభవోపేతమే. విశేషంగా భక్తులు పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల స్థాయిలో టీటీడీ ప్రతి ఏటా….సూర్య భగవానుని పుట్టిన రోజైన రథసప్తమీ రోజున ప్రత్యేక వేడుక తిరుమలలో జరుగుతుంది. వేకువ జామున 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వామి వారు భక్తుల మధ్యనే ఉండి, దర్శన భాగ్యం ఇస్తారు. సూర్య ప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు….రోజుంతా జరుగుతాయి. చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనసేవలు జరగనున్నాయి.

మధ్యాహ్నం రెండు గంటలకు పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం జరుపుతారు. ఈ సారి జరిగే ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలపై టీటీడీ కసరత్తు చేస్తుంది. తిరువీధుల వెంట గ్యాలరీలను నిర్మిస్తున్నది. తోపులాట, తొక్కిసలాటలు లేకుండా స్వామి దర్శనానికి ఏర్పాట్లు చేసింది. అక్కడక్కడ చలువ పందిళ్లను వేస్తున్నారు. గ్యాలరీల్లోని భక్తులకు అన్న,పానీయాలు ఇవ్వడానికి ప్లాన్ చేశారు. బైట్
– రమణదీక్షితులు, ప్రధాన అర్చకులు.టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా ఈ రథసప్తమి వేడుక జరగనుంది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకను ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమవుతుంది. రాత్రి 9.30 గంటల వరకు అమ్మవారు సింహ, అశ్వ, గరుడ, పెద్దశేష, చంద్రప్రభ, గజవాహనాలపై అమ్మవారు విహరించనున్నారు. తిరుచానూరు సమీపంలోని వెలసిన శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుక జరగనుంది. ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమియ్యనున్నారు. ఇక తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్త వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఈ రథసప్తమీ వేడుక తిరుమల స్థాయిలోనే, తిరుపతిలోని అన్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో వైభవంగా జరుపుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com