Home > Bhakti > పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

శబరిమలలో నిత్యాన్నదానం
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

padmavati-ammavaru-apduniaఏడుకొండల స్వామి హృదయ దేవేరి , సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మవతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది .ఈ నేల 15 వ తేదీ బుధవారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 23 గురువారం పంచమి తీర్థం తో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతుంది. ఇప్పటికే ఆలయ ప్రాకారాలు, పరిసరాలు, అమ్మవారి పద్మా సరోవరం విద్యుత్ వెలుగులతో ధగధగలాడుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 15 వ నుంచి 23 వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాల్లో వూరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వాహనసేవల్లో వివిధ రకాల అలంకరణల్లో అలమేలుమంగ భక్తులను కటాక్షించనున్నరు .ఉత్సవాల జరిగే తొమ్మిది రోజుల్లో 16 వాహనాలు , రెండు రథాలపై అమ్మవారు ఊరేగనున్నారు . ఇప్పటికే అమ్మవారికి వినియోగించే అన్ని వాహనాలను శుభ్రం చేసి సిద్దం చేశారు . ఉత్సవాలలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కళా బృందాలు తరలివస్తున్నాయి . వాహన సేవ సమయంలొ కోలాటాలు, భజనబృందాలు, డప్పులు ప్రదర్శన , కేరళ వాయిద్యాలు తదితర ఎన్నోసాంస్కృతిక కార్యక్రమాలను టీటీడి ఏర్పటు చేసింది . ఆస్ధానమండపంలో ఉదయం నుంచి రాత్రి వరకు సాంస్కృతిక కర్యక్రమాలు నిర్వహించనున్నారు .  తిరుమల తరహాలో తిరుచానూరులో ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో ముఖ్యమైన గజవాహనం, గరుడ వాహనం, రథోత్సవం, పంచమితీర్థం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిద రాష్ట్రాలనుంచి తరలి వస్తారు .ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం వలన భక్తుల కోర్కెలు తీరడంతో పాటు జన్మ చేరితార్ధం అవుతుందని భక్తుల నమ్మకం .

ఇక బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు రోజున లోక సంక్షేమార్థం అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవను నిర్వహిస్తారు. అనంతరం బ్రహ్మోత్సవాల ముందు రోజు మంగళవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు . 15వ తేదీ బుదవారం ఉదయం అమ్మవారి ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం అవుతాయి. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ధ్వజారోహణం సమయంలో సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు.

ఇక పద్మవతి అమ్మవారికి ముఖ్యమైన వాహన సేవలు గజవాహనం, గరుడ వాహనసేవ , పంచమితీర్థం . ఈ సేవలలో తిరుచానూరు భక్తులతో కిటకిటలాడుతుంటుంది .అమ్మవారికి జరిగే అన్ని వాహనసేవల్లో ఐదోరోజు రాత్రి జరిగే గజవాహన సేవకు విశేష ప్రాధాన్యం ఉంది. వాహనంపై శ్రీమహాలక్ష్మీ రూపాన్ని ధరించిన అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు భక్తుల సొంతం అవుతాయని భక్తులు నమ్ముతుంటారు . ఇక అమ్మవారి ఉత్సవాల్లో ఆరోరోజు రాత్రి గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. గరుడోత్సవంలో అమ్మవారు శ్రీమహావిష్ణువు రూపాన్ని ధరించి వూరేగుతారు. గరుడ వాహనంపై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సాక్షాత్తు శ్రీవారిని దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం . ఇక బ్రహ్మోత్సవాల్లో చివరగా ముఖ్యమైన ఘట్టం పంచమితీర్థం. ఆ రోజున పద్మసరోవరంలో లక్షలాదిమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారు. చక్రస్నానంతో పాటు భక్తులు స్నానం చేయడం వల్ల సప్తసముద్రాల్లో స్నానం చేసినంత భాగ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటరు. మొత్తానికి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి అర్బన్ పోలీసులు భారీ భద్రత ను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలలో సి సి కెమెరాల నిఘా వ్యవస్థలో ఉందని చెప్పుకోవచ్చు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *