Home > Crime > కులభూషణ్ విడుదలకు మార్గాలు సుగమం

కులభూషణ్ విడుదలకు మార్గాలు సుగమం

ఖమ్మంలో ప్రేమోన్మాదం
ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి అనుమానాస్పద మృతి

kulbhushan-jadav-adpuniaగూఢచర్యం, తీవ్రవాదానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం నిర్బంధించి, మరణ శిక్ష విధించింది. దీంతో పాక్ మిలటరీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది. పాక్ నిర్ణయం సహేతుకంగా లేదని, తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకూ జాదవ్ ఉరిని ఆపాలని ఐసీజే ఆదేశించింది. మరోవైపు కుల్‌భూషణ్‌ను అతడి కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం కల్పించాలని భారత్ అనేక సార్లు ఒత్తిడి తీసుకురావడంతో పాక్ దీనికి అంగీకరించింది. డిసెంబరు 25 న జాదవ్ తల్లి, భార్య ఇస్లామాబాద్‌లో కలుసుకోడానికి అనుమతించింది. పాక్ అనుమతించడంతో కుల్‌భూషణ్‌ను అతడి తల్లి, భార్య కలుసుకున్నారు.అంతేకాదు జాదవ్‌ను ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కుల్‌భూషణ్‌ను కనీసం భారతీయ దౌత్య అధికారులు కూడా కలుసుకోవడానికి అంగీకరించని పాక్ అతడి కుటుంబ సభ్యులను చూడటానికి అనుమతించడం శుభపరిణామమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని భారత్ తమకు అనుకూలంగా మలచుకుని అంతర్జాతీయ న్యాయస్థానంలో మరింత బలంగా వాదనలు వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. గూఢచర్యానికి పాల్పడిన వారిని విడుదల చేసే ప్రశ్నే లేదని పాకిస్థాన్ నొక్కి చెప్పినప్పటికీ, వియన్నా ఒప్పందం ఆధారంగా ఈ కేసులో విజయం సాధిస్తామని భారత ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com