Home > Editorial > త్వరలో కొత్త రూపాయి…

త్వరలో కొత్త రూపాయి…

దాసరీ.. చిత్రసీమలో లేరు నీకు సరి!
ఇసుకాసురులు!

rbi-apduniaకొత్త ఒక రూపాయి నోట్లు త్వరలో రానున్నాయి. ప్రధానంగా గులాబి-ఆకుపచ్చ, అలాగే ఇతర రంగుల కలయికతో ఒక రూపాయి నోట్లను చలామణిలోకి తేనున్నట్టు మంగళవారంనాడు ఆర్‌బిఐ ప్రకటించింది. భారత ప్రభుత్వంతో కూడిన రూపాయి చిహ్నం ఈ నోట్లపై కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక రూపాయి నాణేలు ముద్రిస్తున్నారు. 1994లో ఒక రూపాయి నోట్ల ముద్రను ఆపేసినప్పటికీ 2015లో మళ్లీ ప్రారంభించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్త రూపాయి నోట్లను చలామణిలోకి తీసుకురానున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ నోట్ల ముద్రణను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్‌బిఐ వెల్లడించింది. కాయినేజ్ యాక్ట్ 2011 కింద వీటిని లీగల్ టెండర్ గా ప్రవేశపెట్టనున్నట్టు సెంట్రల్ బ్యాంకు చెప్పింది. ఈ కొత్త ఒక్ రూపాయి చలామణిలో ప్రస్తుత రూపాయి నోట్లపై ఎలాంటి ప్రభావముండదని, అవి కూడా యథావిథిగా కొనసాగుతాయని వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌తో సంతకం ఉంటుందని, మిగతా ఇతర నోట్లపై ఆర్‌బిఐ గవర్నర్ సంతరం ఉంటుందని సమాచారం. నోటు కుడివైపు కింది వైపు నల్లని రంగులో సంఖ్యలు ఉంటాయి. అలాగే 2017 సంవత్సరం ఉంటుంది. ఇంకా ఈ నోటులో సత్యమేవ జయతే పదాలు లేకుండా విండోలో అశోకా పిల్లర్, మధ్యలో రహస్య సంఖ్య ఒకటి, కుడి చేతివైపు నిలువుగా ’భారత్’ అనే పదం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *