Home > Movies > సెకండ్ మ్యారేజ్ కి రేణు రెడీ

సెకండ్ మ్యారేజ్ కి రేణు రెడీ

ధ్యాంక్స్ టూ ఏపీ : కమల్, రజనీ
సిల్వర్ స్క్రీన్ మీదకు ప్రదీప్

renu-desai-apduniaరేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటానంటే పవన్ కల్యాణ్ బెస్టాప్ లక్ చెప్పాడట. పిల్లలు జాగ్రత్త. వారిని చూసుకునే వాడిని జాగ్రత్తగా ఎంచుకో అని చెప్పాడట. అంతే కాదు..తాను పవన్ కల్యాణ్ నుంచి విడిపోయేటప్పుడు నయా పైసలు పోషణ కోసం అడగలేదని చెప్పిందామె. తాను కోట్ల రూపాయలు తీసుకున్నానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇల్లును అమ్మి పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టినట్లు చెప్పిందామె. ఈ విషయం పై తాను ప్రమాణం చేస్తానని చెప్పారు. ఎన్నో ఏళ్లు సహ జీవనం చేసిన తర్వాత అధికారికంగా పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు రేణు. అంతే కాదు..తన పిల్లల కోసం ఆయన ఎక్కడున్నా వస్తాడని..ఇప్పుడు అంతే జరుగుతుందన్నారు. తాము విడిపోయినా..స్నేహితుల్లానే కలిసి ఉంటామని చెబుతున్న తీరు కాస్తంత ఆసక్తికరమే. అకీర, ఆద్య పిల్లలు ఎప్పుడు తండ్రిని కలవరిస్తుంటారని చెప్పిందామె. అంతే కాదు..తనకు సరైన వ్యక్తి దొరగడం లేదని..అందుకే పెళ్లి ఆలస్యమవుతుందని చెప్పిందామె. నన్ను బాగా చూసుకునే వాడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. పిల్లలు వాళ్ల పెద్దనాన్న ఇంటికి వెళ్లి వస్తుంటారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కచ్చితంగా వెళతారని చెప్పారు. తాము ఎందుకు విడాకులు తీసుకున్నామో చెప్పడం ఇష్టం లేదని..ముసలిదాన్ని అయ్యాక పుస్తకంలో వివరిస్తానని చెప్పారు. అంతే కాదు..ఆయన స్పందించకుండా నేను ఏం చెప్పలేనంటున్నారు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ మీద ఒక్క వ్యతిరేక మాట మాట్లాడని రేణు దేశాయ్ అతనితో బంధాన్ని ఎందుకు తెంచుకుందో అర్థం కావడం లేదనే చర్చ సాగుతోంది. తన జీవితంలో పెళ్లి చేసుకోవడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో..మేము విడిపోవడం అంతే భాదను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *