Home > Editorial > ఆర్థికవృద్ధి దిశగా అడుగులు

ఆర్థికవృద్ధి దిశగా అడుగులు

మహానందీశ్వరా.....భూములకు దార్లు వెతుకుతున్నారు...
నినాదాలకే పరిమితమవుతున్నరోడ్డు భద్రతా ప్రమాణాలు

rbi-apduniaఆర్థికాభివృద్ధిలో ప్రజలు నిలిచి గెలువాలంటే కొన్నిరోజులు అభివృద్ధి మందగిస్తుంది. ఆ తర్వాత సంవత్సరం లేదా రెండేళ్లల్లో ఆర్థిక సంపద కొంతమంది నుంచి అందరికి చెందుతుంది. అయితే సమన్వయ లోపంతో కరెన్సీ కష్టాలు మాత్రం తీరలేదు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి మధ్య సమన్వయం లోపం కారణంగా వెనక్కి వచ్చిన కరెన్సీలో కేవలం 1/3వ వంతు కరెన్సీ ముద్రించి విడుదల చేశారు. మొత్తం కరెన్సీలో ఇంకా ఎంత విడుదల చేస్తే సమస్య పరిస్కారం అవుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికైనా ఆర్బీఐ అధికారులు సరైన గణాంకాలు విడుదల చేయాలి. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుం టూ రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయాలి. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించచడానికి కృషిచేయాలి. అప్పుడే వం ద శాతం డిజిటల్ లావాదేవీలు సాధ్యమవుతాయి. దీనిద్వారా సమ్మిళిత ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.సమాజంలోని ఆర్థిక అసమానతలు, ఒక వ్యక్తి రాత్రికిరాత్రే కోటీశ్వరుడు అయ్యే పద్ధతి ఇక ముందు జరుగదు. సహజ వనరులు దోచుకునే పరిస్థితి పోయి ప్రజలు దాచుకునే స్థితి వస్తుం ది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. శ్రీమంతుడు మాత్రమే కాదు సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకునే సందర్భం వస్తుంది. ఇవన్నీ జరుగాలంటే దేశాభివృద్ధి తాత్కాలికంగా మందగిస్తుంది. దీర్ఘకాలికంగా అభివృద్ధి చెం దుతుంది. ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు తగ్గడానికి, ఆర్థిక స్వావలంబన పెరుగడానికి పంచవర్ష ప్రణాళికలు, అనేక సంక్షేమ పథకాలు, బ్యాంకుల జాతీయీకరణ వంటి అనేక కార్యక్రమాలు వచ్చాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా అమలవుతున్నది. అయితే ఆశించినంత ఆర్థిక వ్యత్యాసాలు తగ్గలేదు. దేశ గమనాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక అసమానతలు రూపు మాపడానికి తొంభ య్యవ దశకంలో నూతన ఆర్థిక విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటికి ఇరవై ఐదేండ్లు గడిచినా కూడా ప్రపంచ జీడీపీలో భారత దేశం వాటా 2.99 శాతం మాత్రమే. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన చైనా వాటా 15 శాతం ఉన్నది. అలాగే ఆదేశం మొత్తం జీడీపీలో పారిశ్రామిక వాటా 43.2 శాతం, సేవల రంగం వాటా 46.6 శాతం ఉన్నది. దీన్నిబట్టి ఆ దేశ ఉద్యోగాల సృష్టికి వారివా రి పాలనా విధానాలు ఉపయోగపడుతున్నాయో అవగతమవుతున్నది. అదే మనదేశంలో అయితే మొత్తం జీడీపీలో సేవల రంగం వాటా 51.3 శాతం. పారిశ్రామిక రంగం వాటా కూడా దాదాపు 30 శాతం ఉన్నది. అయినా కొత్త ఉద్యోగాల సృష్టి పెద్దగా జరుగడం లేదు.ఉపాధి లేకుండా అభివృద్ధి జరిగితే అది నల్లధనం పుట్టుకకు కారణమవుతుంది. దాంతో అవినీతి పెరుగుతుంది. అనుత్పాదక రంగంలో అనారోగ్య అభివృద్ధి జరి గి, అది స్థిరాస్తి రంగంలో చొరబడి మెట్రో నగరాల్లో చదరపు గజం విలు వ అమెరికాలోని కాలిఫోర్నియా నగరం కంటే ఎక్కువగా ఉంటున్నది. దీంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి, కొనుగోలు చేయడానికి వారి జీవితం సరిపోవడం లేదు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం 21.92 శాతం ప్రజ లు రోజుకు 130 రూపాయల కూలీ దొరుకక, 2400 క్యాలరీస్ ఆహారం లభించక దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఆర్థిక సంస్కరణల అనంతరం పేదరికం తగ్గినా, ఈ ఇరవై ఐదేళ్లలో 14 శాతం ప్రజల జీవన విధానం మాత్రమే పెరిగింది. చైనాతో పోల్చుకుంటే భారతదేశ తలసరి ఆదాయం కంటే ఐదు రెట్లు ఎక్కువ. మన పొరుగు దేశం శ్రీలంక ఆదాయం కూడా రెండు రెట్లు ఎక్కువగా ఉంది. అమెరికాలో వచ్చిన సంక్షోభం కావచ్చు, యూరోపియన్ యూనియన్‌లో ద్రవ్యమార్పిడి విధానం ద్వారా ఆర్థిక సంక్షోభం కావచ్చు. తాజాగా చైనాలో వస్తున్న ఆర్థిక మాంద్యంలో కూడా దేశ స్థూల అభివృద్ధి రేటు మీద 20-30 శాతం వరకు దాని ప్రభావం పడి అద్భుతాలు సృష్టిస్తున్నది. ఈ తరుణంలో వ్యక్తిగత ఆదాయాలు కొందరికి బాగా పెరిగాయి. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 2020 నాటికి 7వ ప్రపంచ ధనవంతమైన దేశం నుంచి రెండు స్థానాలు ఎగబాకి 5వ దేశంగా ఉంటుందని అంటున్నారు. ఒక సందర్భంలో జాతీయ స్థూల ఉత్పత్తి రెండంకెల చేరువకు వచ్చింది. ఫోర్బ్స్ పత్రిక ప్రచురించినట్టుగా దేశంలో మొదటి పది ధనవంతుల ఆస్తి విలువ 8,32,320 కోట్లు. ఇది మన దేశ బడ్జెట్‌లో సగం. ఇది కేవలం ద్రవ్య విధానం ప్రకటించి ఆస్తులు ప్రకటించిన వారి గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ ఆస్తులు ప్రకటించని వారు ఆదాయ వ్యయాలు చూపించని వారు, నల్ల డబ్బును దాచుకునేవారు, అధికారా న్ని అడ్డు పెట్టుకొని అంతులేని అవినీతికి పాల్పడేవారు ఎందరో ఉన్నా రు. నల్ల డబ్బుతో దేశాన్ని ఆర్థిక అస్థిరపరచాలని ప్రయత్నిస్తున్న తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే ద్రవ్యమార్పిడి విధానం. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కూడా పదేళ్లకొకసారి ద్రవ్యమార్పిడి జరుగాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆ పని చేయకపోవడం వల్లనే అనేక దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయి. ద్రవ్యమార్పడి జరిగితే అట్టడుగు వర్గాల కష్టానికి ఫలితం దక్కుతుందని, అవినీతి తగ్గి నల్లడబ్బు లేని సమాజం నిర్మితమవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసింది. నిర్ణయం మంచిదైనా అమలు విధానమే అసలు సమస్యకు మూలం. ప్రజలు స్వాతంత్య్ర పోరాటంలో గాని, తెలంగాణ ఉద్యమం లో గాని సహనంతో ఉద్యమించారు. అలాగే ఇప్పుడు కూడా డబ్బులు తీసుకోవడానికి అదే ఓర్పుతో క్యూలైన్లో నిలబడుతున్నారు. నల్లధనం, అవినీతిపై యుద్ధం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *