Home > Politics > నల్గొండ బరిలో రేవంత్ రెడ్డి?

నల్గొండ బరిలో రేవంత్ రెడ్డి?

ఇవాళే కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక
ఆడపిల్ల పుడితే సరస్వతి పుట్టిందనుకోవాలి : ఎంపీ కవిత

revanth-reddy-apduniaతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయోగం రాష్ట్రంలో హీట్ పుట్టిస్తోంది. ప్రతిపక్షాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన రచిస్తున్న వ్యూహాలు హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు నల్గొండ ఉప ఎన్నికపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోండగా మరోవైపు కేసీఆర్ వ్యూహాలపైన విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బై ఎలక్షన్ పై అన్ని పార్టీల్లో సమాలోచనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో పట్టుకోసం తీవ్రంగా శ్రమిస్తున్న తెలుగుదేశంలో నల్గొండ ఉప ఎన్నిక మీద ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది…

నల్గొండ లోక్ సభ పరిధిలో తెలుగుదేశం బలంగా ఉంది. కోదాడ, సూర్యాపేట, దేవరకొండ, నల్గొండల్లో ఆ పార్టీకి పటిష్టమైన కేడర్ తో పాటు లీడర్లు కూడా ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో మంచి సంఖ్యలోనే టీడీపీకి ఓటర్లు ఉన్నారు. నల్గొండ ఉపఎన్నిక ప్రాధాన్యత, ఇతర సమీకరణాలు, పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే బాగుంటుందనేది కార్యకర్తల అభిప్రాయం. రేవంత్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా పార్టీకి ఊపువస్తుందని నాయకులు కూడా అంటున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు ఇతర అంశాలు కూడా కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తాయన్నది వారి వాదన. రేవంత్ పోటీలో ఉంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ తో సమానంగా టీడీపీ పోరాటం చేసే అవకాశాలున్నాయని తెలుగు తమ్ముళ్లు చెపుతున్నారు. రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌ తో పాటు అభిమానులు కూడా పార్టీకి కలిసి వస్తారని వారంటున్నారు. గెలిచినా, ఓడినా గట్టి పోటీ ఇస్తే 2019 ఎన్నికల్లో ఆ ప్రభావం కచ్చితంగా టీడీపీ మీద ఉంటుందన్నది తెలుగుదేశం నాయకులు లెక్కలు వేస్తున్నారు. నల్గొండ బరిలోకి దిగిన రేవంత్ రెడ్డికి కూడా వ్యక్తిగతంగా బాగా లాభముంటుందని వారు చెపుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తుందనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

మొత్తానికి నల్గొండ లోక్ సభ సీటు ఖాళీ అయితే కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం ఖాయం. కేసీఆర్ వ్యూహాలను తిప్పికొట్టాలంటే విపక్షాలు సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహారించినా, టీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేసినా ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. అందులోనూ తెలంగాణలో ఉనికి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న తెలుగుదేశం, దాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి కత్తి దూయాల్సిందే. లేకుంటే 2019 ఎన్నికల్లో పసుపు జెండా పాలిపోయి వాలిపోవడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *