Home > Politics > లక్ష్మారెడ్డి ఒక మున్నాభాయ్ ఆర్ ఎంపీ : రేవంత్ రెడ్డి

లక్ష్మారెడ్డి ఒక మున్నాభాయ్ ఆర్ ఎంపీ : రేవంత్ రెడ్డి

ఎన్నికలకు గులాబీ కసరత్తులు
నిరంతర విద్యుత్ తో రైతుకు నష్టం: వీహెచ్

revanth-reddy-apduniaమంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతలపై కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి ఆరోపణల వర్షం కురిపించారు. శనివారం విలేకరుల సమావేశం తో మాట్లాడుతూ మంత్రి విద్యార్హతలను ప్రశ్నించారు. 2004 ఎన్నికలో అఫిడవిట్లో లక్ష్మారెడ్డి 87లో పాసైనట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు. 1990లో అనుమతి వచ్చిన గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లక్ష్మారెడ్డి 88లోనే ఎలా సర్టిఫికెట్ పొందారు? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కాలేజీ ప్రిన్సిపల్ సంపత్రావు ప్రెస్మీట్ తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి ఉత్తముడని హెచ్కేఈ కళాశాల ప్రిన్సిపల్ సంపత్ రావు సర్టిఫికేట్ ఇచ్చారు. 1985లో తమ కళాశాలకు అనుమతి వచ్చిందని ప్రిన్సిపాలే చెప్పారు. 1985 వరకు సీసీహెచ్ అనుమతి లేదని వారే చెబుతున్నారు. అనుమతి లేని కళాశాలలో చదివిన చదువు చెల్లుతుందానని అయన నిలదీసారు. ఇంతకీ లక్ష్మారెడ్డి 1987 లో పాసయ్యారా, 1988లో పాసయ్యారా? గుల్బర్గా యూనివర్సిటీనా…హెచ్కేఈ యూనివర్సిటీనా? అని ప్రశ్నలు సంధించారు. గుల్బర్గా యూనివర్సిటీకి 1990లో అనుమతి వచ్చింది. ఆ యూనివర్సిటీ నుంచి 1988లోనే పాస్ కావడం ఎలా సాధ్యమో మంత్రి లక్ష్మారెడ్డి చెప్పాలని అడిగారు. తెలంగాణ బోర్డ్ ఫర్ హోమియోపతిలో లక్ష్మారెడ్డి నమోదు చేసుకున్నారా? చేయించుకుంటే ఆ పత్రం బయటపెట్టండి. కాలేజీ ప్రిన్సిపల్ సంపత్ రావు కూడా లక్ష్మారెడ్డి బాపతోడేనని రేవంత్ విరుచుకుపడ్డారు. ఈయన ఉద్యోగం ఊడితే…ఆయన ఉద్యోగం కూడా ఊడుతుంది. అందుకే లక్ష్మారెడ్డి తరపున వకాల్తా పుచ్చుకున్నాడని అన్నారు. ఏపీలో ఫాతిమా కళాశాలకు అనుమతిలేనందున ఏమైందో చూస్తూనే ఉన్నాం. లక్ష్మారెడ్డి కచ్చితంగా మున్నాబాయ్ ఆర్ఎంపీనే. ఈ వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నానని అన్నారు. తనను వదిలేయమని లక్ష్మారెడ్డి నా వద్దకు రాయబారం పంపారు. నా అంతట నేను గీతదాటనని చెప్పా. కానీ, సోషల్ మీడియాలో నాపై ఎవరెవరితోనో ఇష్టారాజ్యంగా ప్రచారం చేయిస్తున్నారు. వాళ్ల కార్యకర్తల సభలో లక్ష్మారెడ్డి సమక్షంలో నాపై ఎలాంటి పాటలు పాడించారో పెద్దలు చూడాలి. నాకూ అభిమానులు ఉన్నారు. నన్ను మీ అనుచరులతో అనిపించిన మాటలే మీ ఇంటికి వచ్చి నా అభిమానులు మిమ్మిల్ని మాట్లాడి వస్తారు. దానికి సిద్ధమంటే లక్ష్మారెడ్డి, కేటీఆర్ చెప్పండని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com