Home > Movies > ఏప్రిల్ 14న 2.0 రిలీజ్

ఏప్రిల్ 14న 2.0 రిలీజ్

త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన కత్తి
కొడకా కోటేశ్వరరావుతో ఫుల్ జోష్...

robo-2.0-apduniaకొన్నిరోజులుగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే డిసెంబర్ 31న ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత నాలుగు రోజులుగా ఫ్యాన్స్ మీట్ నిర్వహిస్తున్న రజనీ కాంత్‌ నుండి పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటనైతే రాలేదుకాని ఆయన అప్ కమింగ్ మూవీ విడుదల తేదీపై స్పష్ఠత ఇస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.2018 ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా ‘2.O’ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడంతో రజనీ ఫ్యాన్స్‌కు కొంత ఊరట లభించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అనేక రూమర్స్ నడుస్తున్న సందర్భంలో రిలీజ్ డేట్‌ను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తుండగా.. తలైవాకు జోడిగా అమీజాక్సన్ నటిస్తోంది. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ‘2.O’ మూవీకి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.

రజనీ న్యూస్ తో ఫ్యాన్స్ లో ఖుషీ రజనీకాంత్ సంతోషం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాల్లోనూ పోటీ చేస్తామని తెలిపారు. దేశ రాజకీయాలు భ్రష్టుపట్టాయని, తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని రజనీ హామీ ఇచ్చారు. అధికారం, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, మార్పుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సొంతంగా పార్టీ ప్రారంభించనున్నట్లు తెలియజేసిన రజనీ, పార్టీ ఏర్పాటులో అభిమాన సంఘాలదే కీలక పాత్ర అని అన్నారు.యుద్ధం చేయబోతున్నానని… గెలుపు, ఓటమి భగవంతుడి చేతిలోనే ఉందని తెలిపారు. తనకు రాజకీయాలంటే భయం లేదని, మీడియా అంటేనే భయమని అన్నారు. రాజకీయాల్లో గెలిస్తే విజయమని… లేదంటే విరమణ అని.. కాలమే తన రాజకీయ ఆరంగేట్రాన్ని నిర్ణయించిందని అన్నారు. అవినీతిని అంతం చేయాలని, కొందరు నేతల తీరుతో తమిళనాడు పరువు పోయిందని వ్యాఖ్యానించారు. దేవుడి అండ, ప్రజల ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నానని, ఆధ్యాత్మిక పాలన అందజేస్తానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com