Home > Movies > టాప్ గేర్ లో రోబో 2 శాటిలైట్ బిజినెస్

టాప్ గేర్ లో రోబో 2 శాటిలైట్ బిజినెస్

డీజేకు సెన్సార్ బోర్డ్ నుంచి క్లీయరెన్స్
అందుకే తెలుగు సినిమాల్లో నటించడం లేదు : సన్నీ లియోన్

robo-2-apduniaరజనీకాంత్ సినిమా వస్తోందంటే ఆ క్రేజ్ ఎంత హై లెవెల్ లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని దశాబ్దాలుగా ఆ క్రేజ్ కంటిన్యూ అవుతోంది. ఒక హీరోకు ఇన్నేళ్లపాటు ఇలా గ్లామర్ తగ్గకుండా ఉండడం నిజంగా ఒక మిరాకిల్. ఇప్పుడు రజనీ చేస్తున్న రోబో 2.0 మూవీకోసం అందరూ చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ స్థాయిలోనే అమ్ముడైనట్టు తాజా సమాచారం. ఈ మూవీలో రజనీతో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా యాక్ట్ చేయడం ఎక్స‌ట్రా ఎట్రాక్షన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ డైరెక్టర్ శంకర్. అందువల్ల కూడా బిజినెస్ మంచి రేంజ్ లో జరుగుతోందని అంటున్నారు. 2.0 సినిమా హిందీ హక్కులు 80 కోట్లకి అమ్ముడు కావడం విశేషం. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రేటు కూడా ఆశ్చర్య చకితులను చేస్తోంది. అన్ని భాషల్లోను కలుపుకొని ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ సంస్థ 110 కోట్లకి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే విడుదలకి ముందే ఈ సినిమా దాదాపు 200 కోట్ల బిజినెస్ చేసినట్టు అవుతుంది. ఒక్కోసారి శాటిలైట్ రైట్స్ బిజినెస్ కావడం కూడా చాలా కష్టంగా జరుగుతుంది. పెద్ద హీరోల సినిమాలు కూడా ఆ కష్టాన్ని, ఇబ్బందిని ఫేస్ చేసిన దాఖలాలున్నాయి. కానీ ఇప్పుడు రోబో 2 శాటిలైట్ బిజినెస్ చూసి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆశ్చర్య పోతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *