Home > Politics > చిరంజీవి-రోజా ఇంటర్వ్యూతో పెరిగిన సాక్షి రేటింగ్

చిరంజీవి-రోజా ఇంటర్వ్యూతో పెరిగిన సాక్షి రేటింగ్

అమెజాన్‌కు సుష్మా స్వరాజ్ వార్నింగ్
జగన్ పై జేసీ సెటైర్లు

roja-chiru interview_apduniaమెగాస్టార్ చిరంజీవితో సీనియర్ హీరోయిన్ రోజా ఇంటర్వ్యూ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. రోజా ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రోజా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడు తుంటారు. ఎవరినైనా తిట్టాలంటే పార్టీ నాయకుడు జగన్ రోజాకే ఆ భాద్యత అప్పగిస్తుంటారు. ప్రస్తుతం జగన్ రోజాకు సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ జాబ్‌ ఇచ్చారు. ఆమె మెగాస్టార్ చిరంజీవిని స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేశారు. చిరంజీవి ఇప్పుడు వెండితెర రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అన్ని మీడియా ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. చిరంజీవి ఇంటర్వ్యూతో రోజా ఇమేజ్ పెరిగిపోయింది. రోజా ఒకప్పుడు చిరంజీవి రోజా కలిసి నటించారు. రాజకీయాల్లోకి వచ్చేసరికి వీరి మధ్య గ్యాప్ వచ్చింది. వీలు కుదిరినప్పుడల్లా చిరంజీవిపై నోరు పారేసుకున్నారు రోజా. అలాంటి రోజా ఈ ఇంటర్వ్యూ చేయడం ఆసక్తిగా మారింది. రోజా సరదా పడ్డారో లేదా ఛానల్ వాళ్ళ క్రియేటివిటో గానీ అన్ని ఇంటర్వ్యూల కంటే సాక్షి ఛానల్‌లో వచ్చిన ఇంటర్వ్యూకు భారీ రేటింగ్ వచ్చిందని టాలీవుడ్‌లో టాక్ వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *