Home > Movies > సల్మాన్ టాప్

సల్మాన్ టాప్

గాయత్రి ఫస్ట్ లుక్
రామ్ చరణ్ తో బాలీవుడ్ హీరో ఫైట్

salman-apduniaబాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సెలబ్రిటీల్లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఫోర్బ్స్ రిలీజ్ చేసిన జాబితాలో వరుసగా రెండవ సారి సల్మాన్ ఖాన్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. వంద మంది భారతీయ సెలబ్రిటీల జాబితాలో షారుక్ ఖాన్, విరాట్ కోహ్లీ, ప్రియాంకా చోప్రాలు తర్వాత స్థానాల్లో నిలిచారు. అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 వరకు ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ సంపాదించారన్న దానిపై ర్యాంక్‌లను తయారు చేశారు. ట్యూబ్‌లైట్ ఫిల్మ్ బాక్సాఫీసు దగ్గర విఫలమైనా.. టైగర్ జిందా హై స్టార్ సల్మాన్ మాత్రం ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే నిలిచాడు. సల్మాన్ ఈ ఏడాది రూ.232.83 కోట్లు ఆర్జించాడు. షారూక్ రూ.170.5 కోట్లు, విరాట్ రూ.100.72 కోట్లు ఆర్జించారు. ఈ ముగ్గురూ టాప్‌లోనే ఉన్నా.. గత ఏడాదితో పోలిస్తే ఇది తక్కువే. గత ఏడాది ఈ ముగ్గురి ఆదాయం రూ.626.52 కోట్లు కాగా.. ఈసారి వీళ్లు కేవలం రూ.504.05 కోట్లు మాత్రమే ఆర్జించారు. దక్షిణాదికి చెందిన 13 మంది సినీతారలు టాప్ సెలబ్రిటీల జాబితాలో చేరారు. మరోవైపు బాలీవుడ్ నుంచి ఈ సంఖ్య 35 నుంచి 33 వరకు తగ్గింది. అత్యధికంగా డబ్బు సంపాదించిన సెలబ్రిటీల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఉన్నది. ఆమె మొత్తం రూ.57.25 కోట్లు ఆర్జించింది. రియో ఒలింపిక్స్ తర్వాత ఆమె అనేక బ్రాండ్లను ప్రమోట్ చేసింది. దాని ద్వారా సింధు సంపాదన 17 రేట్లు పెరిగినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com