Home > Bhakti > జనవరి 31 నుంచి సమ్మక్క-సారక్క జాతర

జనవరి 31 నుంచి సమ్మక్క-సారక్క జాతర

జూన్ 12 నుండి 16వ తేదీ వరకు కోదండరామాలయ మహాసంప్రోక్షణ
దుర్గమ్మ గుడిలో నకిలీ నియమకాలు

sammakka-sarakka-jatara-apduniaఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతరపై సర్కార్ నజర్ పెట్టింది. జనవరి చివరికి జరిగే జాతరకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై సెక్రటేరియట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి చందూలాల్. ఈసారి దేశ విదేశీ ప్రముఖులను జాతరకు పిలవాలని నిర్ణయించారు. కోటికి మించి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గిరిజన తెగలు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ప్రజా ప్రతినిధులను పిలుస్తామన్నారు మంత్రి.జనవరి 31న మొదలయ్యే జాతర ఫిబ్రవరి 3 వరకు జరుగుతుందన్నారు చందూలాల్. ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తర్వాత సీఎంతో మాట్లాడి పనులు మొదలుపెడతామన్నారు. దీనిపై త్వరలోనే దేవాదయశాఖ మంత్రితో మరోసారి సమావేశమవుతామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *