Home > General > ఇసుక దందా రీస్టాట్

ఇసుక దందా రీస్టాట్

బస్సెక్కితే బాదుడే
ఆకాశంలో జన్మించాడు.... బంపర్ ఆఫర్ కొట్టాడు

sand2_apduniaసంచలనం సృష్టించిన ఇసుక అక్రమ రవాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడినా మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో భారీగా ఇసుక తరలిపోతోంది. ఏర్పేడు ఘటన తర్వాత కొంత వెనుకంజ వేసిన ఇసుకాసురులు పది రోజుల నుంచి మళ్లీ చెలరేగుతున్నారు. నెలరోజుల వ్యవధిలో శ్రీకాళహస్తి మండలంలో కోట్లాది రూపాయలు ఇరిగేషన్‌ పనులు మంజూరయ్యాయి. ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ పనులు చేస్తున్నట్లు వారి వద్ద పర్మిట్‌ పొందుతున్నారు. ట్రాక్టర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోతో కూడిన బ్యానర్‌ కట్టుకుని మరీ ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక అధికారులు దాడులు నిర్వహించి ఉన్నత అధికారులకు
అప్పజెప్పడంతో వారు నామమాత్రపు జరిమానా వేసి వదిలివేస్తున్నారు. ఫలితంగా çస్వర్ణముఖి నదిలోని ఇసుకను విచ్చలవిడిగా బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే ఇసుక వ్యాపారం చేపడుతుండడంతో వారిని అడ్డుకోవడానికి స్థానిక అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా స్వర్ణముఖినది నుంచి ట్రాక్టర్లతో ఇసుకను రాజమార్గంలో తరలిస్తున్నారు. ఇసుక రవాణాను అడ్డుకుంటున్న వారిపై అక్రమార్కులు దాడులకు దిగుతున్నారని అమ్మపాళెం, పుల్లారెడ్డి కండ్రిగ, సుబ్బానాయుడు కండ్రిగ, తొండమనాడు గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   శ్రీకాళహస్తి మండలంలో ప్రతి పంచాయతీలో ఇరిగేషన్‌ శాఖకు చెందిన చెక్‌డ్యామ్‌ పనులు మంజూరయ్యాయి. అయితే సంబంధిత కాంట్రాక్టర్లు స్వర్ణముఖినది నుంచి ఇసుక తీసుకెళ్లి పనులు చేయాలంటే రవాణా చార్జీలు ఎక్కువ అవుతాయన్న కారణంతో స్థానికంగా ఉండే చెరువుల మొరవ కాలువలు, వంకలు, వాగుల్లో ఉన్న ఇసుకను తరలించి పనులు చేస్తున్నారు. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం పేరుతో తమ రాజకీయ
పలుకుబడి ఉపయోగించి అధికారుల వద్ద పర్మిట్లు పొందుతున్నారు. ఈ వంకతో స్వర్ణముఖి నది నుంచి ఇసుకను తిరుపతి, సత్యవేడు తదితర ప్రాంతాలకు తరలించి అక్కడ నుంచి బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాళెం, పుల్లారెడ్డికండ్రిగ, ఓటిగుంట, సుబ్బానాయుడు కండ్రిగ, తొండమనాడు తదితర ప్రాంతా ల నుంచి ఈ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. దీంతో స్వర్ణముఖి నదిలో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *