Home > Editorial > ఇసుకాసురులు!

ఇసుకాసురులు!

త్వరలో కొత్త రూపాయి...
ఆన్ లైన్ లో పశు సంపద వివరాలు
 
sand mafia_apduniaకడప జిల్లాలో పెన్నా, కుందూ, పాపాఘ్ని, చెయ్యేరు నీటి వనరులు కలిగిన నదులు. అనాదిగా ఈ నదుల నుంచి యధేచ్చగా జరుగుతున్న ఇసుక దోపిడిని అరికట్టాలని ఎపి సర్కార్ భావించింది. ఇసుకను క్వారీల నుంచే ఇసుకను తరలించే విధంగా మార్గదర్శకాలు చేసింది. అయితే ఉచిత ఇసుక సామాన్య, మద్య తరగతి కుటుంబాలకు ఉపయోగ పడుతుందని అధికారులు భావించారు. అయితే కొందరు అధికారపార్టీ చెప్పుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుకను తవ్వి 
డిమాండ్ ఉన్న ప్రధాన నగరాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో భాగంగానే నదుల్లోకి ఏకంగా రహాదారిని సైతం నిర్మించుకుని దొరికిన కాడికి దోచేస్తున్నారు. రేయింబవళ్లు యంత్రాల సహాయంతో పెన్నమ్మను తోడేస్తూ నదీ తీర ప్రాంత ప్రజలకు నిద్రహారాలు లేకుండా చేస్తున్నారు అక్రమార్కులు. అనుమతి లేని ప్రాంతాల నుంచి కూడా ఇసుక తవ్వేస్తూ నదీమతల్లికి తూట్లు పొడుస్తున్నారు. ఇసుక రవాణా చేసుకునేందుకు సామాన్య, మద్య తరగతి కుటుంబాలకు వీలు లేని పరిస్ధితి ఉంది. దీంతో వారు కూడా వీరినే ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఇదే అదునుగా 
భావించిన ఇసుక మాఫియా వారి అవసరాలను కూడా అనుకూలంగా మలుచుకుంటున్నారు. ట్రిప్పు ఇసుక రెండు వేలకు విక్రయిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇసుక దందా  జిల్లాలో ఏ స్ధాయిలో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్న ఇసుకాసురుల ఆగడాలకు అడ్డుకట్టవేయాలని పలువురు కోరుతున్నారు. సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి అక్రమాలకు తెరదించాలని అంటున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *