Home > Bhakti > బ్రహ్మోత్సవాలకు 8 కోట్లతో సర్వభూపాల వాహానం రెడీ

బ్రహ్మోత్సవాలకు 8 కోట్లతో సర్వభూపాల వాహానం రెడీ

ఆపదలో ఆంధ్రా భద్రాద్రి
పాతపల్లిలో నాన్‌ వెజ్‌ హనుమా

sarva-bhoopla-vahanam-ttd-apduniaతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 26వ తేదీ రాత్రి స్వామి విహరించడానికి దాదాపు రూ.8కోట్లతో టిటిడి నూతన సర్వభూపాల వాహనాన్ని సిద్ధం చేసింది. సర్వభూపాల వాహన తయారీకి 8.89 కిలోల బంగారం, 355 కిలోల రాగిని కలిపి చెక్క బరువుతో కలిపి 1020 కిలోల బరువుతో ఈ రథం సిద్ధమైంది. ఇప్పటికే ఈ వాహనాన్ని టిటిడి ప్రయోగాత్మకంగా పరిశీలించింది. కాగా శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 19వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 22న స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరుగుతుంది. 23న మీనలగ్నంలో సాయంత్రం 5.48 నుంచి 6 గంటల మధ్య వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అదే రోజు రాత్రి 9 గంటలకు స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు శ్రీ మలయప్ప స్వామివారు 16 వాహనాల్లో చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమస్తారు. కాగా పెద్దశేష వాహనం, ముత్యపు పల్లకి, కల్పవృక్ష, సర్వభూపాల, స్వర్ణరథం, రథోత్సవాల్లో స్వామివారు ఉభయ దేవేరులతో కలసి భక్తులకు దర్శనమిస్తారు. చిన్నశేష,హంస, సింహ, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు మాత్రమే వివిధ రూపాల్లోభక్తులను అనుగ్రహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *