Home > Tirumala News > భద్రత కరువు

భద్రత కరువు

బ్యాంక్ లో స్వామి వారి బంగారం 2,780 కిలోలు
ఎట్టకేలకు దిగొచ్చిన టీటీడీ

 golla mandapam_apdunia'ఓ వైపు నిఘా హెచ్చరికలు. మరోవైపు హై అలెర్ట్. ఉన్నప్పటికీ తిరుమల శ్రీ వారి ఆలయ భద్రత మాత్రం గాల్లో దీపంలా తయారైంది. ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో మూడంచెల భద్రత ఉంటుంది. కానీ ఆలయం ఎదురుగానే ఉన్న గొల్లమండపంపై కొంతమంది ప్రముఖుల పేర్లు రాసి ఉడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాక ఆలయ పరిసరాల్లో భద్రత డొల్లతనం మరోమారు బయట పడింది. దీంతో తిరుమలలో నిఘా వ్యవస్థపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న గొల్లమండపంపై కొంతమంది ప్రముఖుల పేర్లు రాయడంతోపాటు ఆ అగంతకుడి సమాచారం కూడా రాసి ఉండటం కనిపించింది. అతడు దర్జాగా వచ్చి అంత సమయం అక్కడ కూర్చొని రాస్తున్నా పట్టించుకున్నవారే లేకపోవడం నిఘా వ్యవస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అక్కడే విధులు 
నిర్వహిస్తున్న యస్పీయఫ్ సిబ్బంది కూడా ఆ వ్యక్తిని ప్రశ్నించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆలయం వద్దకు మీడియాగానీ, భక్తులుగానీ రావాలంటే అనేక ప్రశ్నలు అడిగే పోలీసు సిబ్బంది గొల్ల మండపం పై రాసిన వ్యక్తిని ఎందుకు ప్రశ్నించ లేదు అనేదే అసలు ప్రశ్న. ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్నవారికి… గోడ పై రాసిన వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎది ఏమైనా కొంత మంది ప్రముఖుల పేర్లను  ఎందుకు అక్కడే రాయ వలసి వచ్చింది? అతని ఉద్దేశం ఎమిటి అనేది ఇంకా తెలియ వలసి ఉంది. గొల్లమండపం గోడలపై రాతలను గమనించిన మీడియా సిబ్బంది కథనాలను ప్రసారం చేయడంతో… విజిలెన్స్ అధికారులు స్పందించారు. ఆలయం వద్దకు చేరుకొని గోడలపై రాతలను పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి, తగిన చర్యలను తీసుకుంటామని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *