Home > Sports > రెండు దేశాలకు చావో, రేవో

రెండు దేశాలకు చావో, రేవో

వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ టాప్
టీమ్ లో 14 మందికి అవకాశం

india vs newzelandసెకండ్ వన్డేలో కోహ్లీసేన విజయ దుందుభి మోగించింది. తప్పక గెలవాల్సిన పోరులో ఒత్తిడిని చిత్తుచేసింది. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండు జట్ల మధ్య ఇది 100వ వన్డే కాగా టీమిండియాకు 50వ విజయం. దీంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది. కాన్పూర్‌లో రేపు జరిగే అంతిమ సమరంలో రెండు జట్లు చావోరేవో తేల్చుకుంటాయి. .న్యూజిలాండ్ చేతిలో మొదటి వన్డేడను అనూహ్యంగా కోల్పోయిన టీమిండియా రెండో మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకుంది. సిరీస్‌ను చేజారకుండా నిలబెట్టుకుంది. ప్రస్తుతానికి ఇరు జట్లు చెరొక విజయంతో సమవుజ్జీలుగా ఉండడంతో, ఈనెల 29న కాన్పూర్‌లో జరిగే చివరి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కాగా, రెండో వనే్డలో బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహల్, బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ చక్కగా రాణించడంతో, భారత్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. 231 పరుగుల లక్ష్యాన్ని ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే, కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.పుణె వన్డేలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని.. కాన్పూర్ వన్డేలో భారత్‌ని ఓడించి సిరీస్‌ చేజిక్కించుకుంటామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు. గత ఆదివారం వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో గెలిచిన న్యూజిలాండ్.. బుధవారం ముగిసిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల ఈ సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది. విజేత నిర్ణయాత్మక మూడో వన్డే కాన్పూర్ వేదికగా ఆదివారం జరగనుంది.‘మా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పుణె వన్డేలో విఫలమయ్యారు. మ్యాచ్ ఆరంభంలోనే పేసర్లు భువనేశ్వర్, జస్‌ప్రీత్ బుమ్రా చక్కగా లెంగ్త్‌కి కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో మా టాప్ ఆర్డర్ తడబడింది. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని… కేన్ విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు.వాంఖడే వన్డేలో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఓడిపోగా.. పుణె వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఓడిపోయింది. ఉక్కపోతలో కూడా భారత బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తే.. ఫీల్డర్లు వారికి చక్కటి సహకారం అందించారు.మరో వైపు భారత్‌ లాంటి కఠినమైన ప్రత్యర్థిని ఓడించాలంటే మెరుగైన ప్రదర్శన చేయాలని ..భావిస్తోంది. మరో వైపు వాంఖడే విజయం తర్వాత.. పుణె వన్డేలో భారీగా అంచనాలు పెరగడంతో…ఒత్తిడికి గురయ్యారు.. దీంతో ఆదివారం మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com