Home > Movies > సావిత్రి మూవీలో శాలినీ పాండే

సావిత్రి మూవీలో శాలినీ పాండే

యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్న జై లవకుశ ట్రయిలర్స్
హిందీ లవకుశకు ఫుల్ డిమాండ్

shalini-pandey-apduniaనటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’లో మరో నటీమణి నటించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో టైటిల్ లో రోల్ కీర్తి సురేష్, ఒక జర్నలిస్టు పాత్రలో సమంత, మరో పాత్రలో నిత్యామీనన్ లు నటిస్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ శాలినీ పాండే కూడా జాయిన్ అవుతోందని సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాతో ఈమె మంచి గుర్తింపు సంపాదించుకుందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో శాలినీ ‘మహానటి’లో ఒక ముఖ్యపాత్రను చేయబోతోంది.సావిత్రి జీవిత కథ సినిమాలో నాటి తరం నటీమణులకు కూడా స్థానం ఉంటుంది. సావిత్రి జీవితం అంతా సినిమా వాళ్ల మధ్యనే గడిచింది కాబట్టి.. చాలా మంది ప్రస్తావన ఉంటుంది. ఇప్పటికే సావిత్రి భర్త జెమినీ గణేషన్ పాత్రలకు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ను ఎంచుకున్నారు. ఇక శాలిని పాత్ర లివింగ్ లెజెండ్‌ జమునగారిది అని సమాచారం.సావిత్రితో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నటి జమున. అలాగే సావిత్రిని ‘అక్క..’ అని సంబోధిస్తారీమె. సావిత్రి జీవిత చరమాంకం వరకూ కూడా జమున ఆమెతో టచ్ లో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సావిత్రి బయోపిక్ లో జమున పాత్రకు చాలా ప్రాధాన్యతే ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలో శాలినీ పాండే కనిపించబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *