Home > Politics > ఏఐడీఎంకేనుంచి శశికళ, దినకరన్ ఔట్

ఏఐడీఎంకేనుంచి శశికళ, దినకరన్ ఔట్

అమలుకు నోచుకోని హామీలు
కారులోనే ఉంటారా.. లేక కాషాయ కలరింగ్ ఇస్తారా..

dinakaran-sasikala-apduniaఅందరూ అనుకున్నట్టే జరిగింది. శశికళ-దినకరన్‌ వర్గంపై వేటు పడింది. పార్టీలో చక్రం తిప్పాలని భావించిన ‘చిన్నమ్మ’ శశికళను పార్టీ నుంచి బయటకు పంపారు. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన ఆమెను తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవి నుంచి శశికళను తప్పిస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం ఆమోదించింది. సమావేశం అనంతరం తమిళనాడు మంత్రి ఉదయ్‌కుమార్‌ తీర్మానాన్ని చదివి వినిపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని ప్రకటించింది. పార్టీ తాత్కాలిక చీఫ్ గా పన్నీర్ సెల్వంను ఎన్నుకున్న సమావేశం కో కన్వీనర్ గా ముఖ్యమంత్రి పళనిస్వామి ఉంటారని తీర్మానించింది. డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ హోదాలో దినకరన్‌ తీసుకున్న నిర్ణయాలు ఇకపై చెల్లవంటూ కుడా అన్నాడీఎంకే సింబల్‌గా రెండాకుల గుర్తును ఖరారు చేస్తూ మరో తీర్మాణం ఆమోదించారు.

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశ నిర్ణయంతో పార్టీలో ఇక శశికళ శకం ముగిసినట్టే. జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న చిన్నమ్మ.. అనంతరం అనూహ్య పరిణామాలతో జైలు పాలైంది. పార్టీ రెండుగా చీలిపోవడం.. దినకరన్‌ ఎంట్రీతో లుకలుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత.. పళని-పన్నీరు వర్గం ఏకం కావడంతో శశికళ వర్గానికి చెక్‌ పడింది. ఇవాళ్టి పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానంతో.. ఇక పార్టీ పూర్తిగా పళని-పన్నీరు చేతిలోకి వచ్చింది. తనను పార్టీ నుంచి తొలగించడంపై దినకరన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశం తీసుకున్న తీర్మానాలను దినకరన్ ఖండించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *