Home > Politics > ఏడాదిగా సెక్రటేరియెట్ గడపెక్కని కేసీఆర్

ఏడాదిగా సెక్రటేరియెట్ గడపెక్కని కేసీఆర్

జనం జేజేలు సరే.... ఓట్ల రూపంలోకి మారతాయా
పశ్చిమ గోదావరి లో టీడీపీ, బీజేపీ కోల్డ్ వార్

kcr-apduniaతెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఉండి సచివాలయానికి రాకుండా ఏడాది పాటు ఉన్నారు. భారత దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఏడాది పాటు ఇలా సెక్రటేరియట్ కి రాకుండా ఉండలేదు. అందుకే అరుదైన గౌరవాన్ని ఆయన దక్కించుకున్నారు. తన ఫామ్ హవుస్ కు లేకపోతే ప్రగతి భవన్ కు తప్ప సచివాలయం వైపు ఆయన కన్నెత్తి చూడటం లేదు. పోయినేడు సరిగ్గా ఫిబ్రవరి3న కేసీఆర్ సెక్రటేరియట్ కు వచ్చిన అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తు పేరుతో ఆయన సచివాలయం వైపు రావడం మానుకున్నారనేది వాస్తవం. కానీ ఆ సంగతి ఎక్కడా ఆయన ప్రస్తావించడం లేదు. చాలా మంది ముఖ్యమంత్రులు అదే సెక్రటేరియట్ నుంచే పాలన చేశారు. కానీ కేసీఆర్ కు అలా పాలన చేయడం ఇష్టం లేదు. అందుకే అటువైపు కన్నైత్తైయినా చూడటం లేదంటారు. వాస్తుపరంగా సచివాలయంలో కొన్ని మార్పులు చేయించుకున్నారు. అయినా సరే పూర్తి నమ్మకం కుదరలేదట. ఆయన కోసం ఏకంగా ప్రగతి భవన్ ను నిర్మించుకున్నారు. అక్కడ నుంచే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరును తప్పు పట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ఏడాది నుంచి సచివాలయానికి రాకుండా ఇంటికి, ఫాం హౌస్‌కు పరిమితమైనందుకు కుంభకర్ణ అవార్డు ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సచివాలయంలోని సీఎం కార్యాలయానికి వచ్చి సరిగ్గా ఏడాది కాలం పూర్తయిందని ట్వీటర్‌లో ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. సీఎం తన నివాసానికే పరిమితమైపోయారని, కార్యాలయానికి వచ్చి, ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇప్పటిదాకా ఏ సీఎం కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించలేదనే విమర్శలొస్తున్నాయి. ప్రజలకు ఇంతగా దూరంగా ఉండే వ్యక్తి మరొకరు ఉండరేమో. తన కొడుకు కోసం ఏకంగా సెక్రటేరియట్ ను మార్చాలని ప్రయత్నించినా అది ఆలస్యమవుతూ వస్తోంది. విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో అది కాస్త పడకన పడింది.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *