Home > Crime > గౌరీ హత్యకేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు

గౌరీ హత్యకేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు

వామ్మో... గాంధీ ఆస్పత్రి
గౌరీ లంకేశ్ దారుణ హత్య

siddaramaiah-apduniaజర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ప్రకటించారు. సీనియర్ ఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. గౌరీ లంకేష్ హత్యను ఖండించిన సిద్ధారామయ్య.. తాను ఒక మంచి మిత్రురాలిని కోల్పోయానన్నారు. నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఈ హత్యపై సిట్ దర్యాప్తు జరుపనున్నామని, గౌరీ లంకేశ్ కుటుంబ సభ్యులు కోరితే సిబీఐ దర్యాప్తునకు కూడా వెనుకాడేదని లేదని తెలిపారు. హత్య వెనుక కుట్ర కోణం ఉందా లేదా అనేది తాను ఇప్పుడే చెప్పలేదని, ఇటీవల తాను గౌరీ లంకేశ్ను కలిసినప్పుడు తనకు ఎలాంటి ప్రాణిహాని ఉన్న విషయాన్ని తనకు చెప్పలేదని అన్నారు. గౌరీ లంకేశ్ను విమర్శిస్తూ ఇద్దరు వ్యక్తులు ఫేస్బుక్లో పోస్టులు పెట్టారని.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఆమెపై కాల్పులు జరిపిన వారు ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ అయి ఉంటారని, ఆమె నివాసం వద్ద రెక్కీ నిర్వహించి ఆమె కదలికల్ని గమనించి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

సీసీటీవీలో దుండగుల ముఖాలు సరిగ్గా కనిపించలేదని, అయితే మిగిలిన ఆధారాలను కూడా సేకరిస్తున్నట్లు చెప్పారు. మూడు బృందాలు ఏర్పడి.. లంకేష్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. మరోవైపు, గౌరి లంకేష్ హత్యకు సంబంధించిన వివరాలన్నింటినీ తెలియజేయాల్సిందిగా కేంద్రం కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. హత్యకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికను కర్ణాటక ప్రభుత్వంనుంచి తెప్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను
ఆదేశించారు. మంగళవారం నాడు బెంగళూరులోని తన నివాసంలో గుర్తు తెలియని దుండగులు గౌరీ లంకేష్ ను కాల్చి చంపారు. కన్నడ పత్రిక గౌరీ లంకేష్ పత్రికే కు ఎడిటర్ గా పని చేస్తున్న ఆమె రాత్రి విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *