Home > Vanitha > Beauty > పువ్వులతో చర్మ సౌందర్యం

పువ్వులతో చర్మ సౌందర్యం

చికెన్ లాలీ పాప్స్

mallepuvulo-apduniaమల్లెలు, గులాబీలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి.
– ముఖ చర్మాన్ని మృదువుగా చేసి, తాజాగా వికసించేలా చేయడంలో పువ్వులు అద్భుత ఔషధంలా పనిచేస్తాయి. సూర్యకిరణాలతో నల్లగా మారే చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి.
– పొడిబారిన చర్మాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురాగలిగే శక్తి మల్లెపూలలో ఉన్నది.
– చెంచాడు మల్లెపూలను ముద్దగా గ్రైండ్ చేసి, ఆ మిశ్రమానికి చెంచాడు పచ్చిపాలను కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. చర్మం కాంతులీనుతుంది.
– గుప్పెడు గులాబీ రేకులను రెండు చెంచాల నీటితో కలిపి ముద్దలా తయారు చేయాలి. చెంచాడు చొప్పున పాలు, గ్లిజరిన్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చన్నీళ్లతో కడిగేసుకుంటే ప్రభావం కనిపిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది.
– చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు మందారం మరొక ఔషధం.
– మందార పూరేకుల్ని, గులాబీ రేకులను కలిపి ముద్దలా తయారు చేయాలి. దానికి ముల్తానీ మట్టిని కలిపి ముఖానికి పట్టించాలి. ఇరువై నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *