Home > Vanitha > Beauty > చలికాలంలో చర్మం తేమగా, తాజాగా ఉండాలంటే…

చలికాలంలో చర్మం తేమగా, తాజాగా ఉండాలంటే…

వంటింటి చిట్కాలు ..
మనం చేసే పచ్చళ్ళు , స్వీట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే
beauty_apduniaచలికాలంలో చర్మం తేమగా, తాజాగా ఉండాలంటే  స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుని.. మృదువుగా మర్దన చేసుకుంటే చర్మం పొడిబారదు. చర్మం తేమగా, తాజాగా కనిపిస్తుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. పాలు, పంచదార, తేనె మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్లకు రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మం లోపల రక్తప్రసరణ సరిగ్గా జరిగేందుకు ఉపకరిస్తుంది.చలికాలంలో తేమ అందించే సబ్బులే వాడాలి. సహజ నూనెలు, గ్లిజరిన్‌ ఎక్కువగా ఉన్నవి ఎంచుకున్నా సరిపోతుంది. చేతుల్ని కప్పి ఉంచేలా నూలు గ్లౌజులు ధరించడం ద్వారా చర్మాన్ని రక్షించిన వారవుతారు. ఈ కాలంలో ముఖానికి వేసుకునే పూతల విషయలో జాగ్రత్తగా ఉండాలి. పాలు, నూనె ఆధారిత పూతలు మేలుచేస్తాయి. ఆలివ్‌ నూనె కలిపిన పూతలు వేస్తే చర్మానికి ఎంతో మేలు చేస్తుందని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *