Home > Editorial > బానిస బతుకులు

బానిస బతుకులు

పార్లమెంట్‌ లో చర్చలకు దారేదీ...
తొలకరి కనిపించింది... మాయమైపోయింది

home guards_apduniaహోంగార్డుల జీవనం దుర్భరంగా మారింది. అసలే అరకొర జీతం.. అది కూడా నెల నెలా అందని పరిస్థితి. పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్నా.. ఇప్పటికీ అప్పు చేయనిదే కుటుంబం గడవని దీనావస్థ. జిల్లాలో 800 పైచిలుకు హోంగార్డులు పని చేస్తున్నారు. వీరిలో 725 మంది పోలీసు శాఖలో ఉన్నారు. మిగిలిన వారు రోడ్డు రవాణా శాఖ, సివిల్‌ సప్లయ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, సబ్‌జైలు తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా పని చేస్తున్నా ఇప్పటికీ వీరి జీతం రూ.12వేలే. ఈ మొత్తం కూడా ఎప్పుడు వస్తుందో.. ఎంత కోత పడుతుందోననే బెంగ ఉంటోంది. ప్రతి నెలా 5లోగా జీతాలు చెల్లించాలని గత ప్రభుత్వాలు జీఓలు విడుదల చేసినా.. అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. పోలీసుశాఖ ద్వారా రిక్రూట్‌ అయి ఇతర ప్రభుత్వశాఖలకు డెప్యూటేషన్‌లపై వెళ్లిన హోంగార్డుల పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది. పోలీసుశాఖకు ప్రతి నెలా 725 మంది హోంగార్డులకు సంబంధించిన జీతాలకు మాత్రమే బడ్జెట్‌ విడుదలవుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సరైండరైన ఉద్యోగులకు జీతాలు రావట్లేదు. ఇలాంటి వారి సంఖ్య దాదాపు 40 మందికి పైగా ఉన్నారు. మరికొందరు ఆయా శాఖల్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది. పోలీసు అధికారులు వారికి పోస్టింగ్‌లు చూపించడం లేదు. దీంతో ఒక నెల కొంతమందికి, మరో నెల ఇంకొందరికి విధులకు పంపేవారు. ఖాళీగా ఉన్న సమయంలో వారికి జీతాలు అందే పరిస్థితి లేదు. ఈ నెల నుంచి బడ్జెట్‌ వస్తున్న 725 మంది నుంచి కొంత మంది కట్‌ చేసుకొని వీరికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల ఒక్కో హోంగార్డు నుంచి రూ. 800 వరకు వసూలు చేశారు. ‘‘చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నాం. ఇందులోనూ కోతలు పెడితే ఎలా’’ అంటూ చాలామంది హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుశాఖలో ఎవరికీ తలెత్తని బడ్జెట్‌ సమస్య హోంగార్డులకే ఎందుకు వస్తోందని వాపోతున్నారు. పోలీసుశాఖలో హోంగార్డులు అంతర్భాగమని, వారు లేని శాఖను ఊహించుకోలేమని కొందరు అధికారులు ఉపన్యాసాల్లో చెబుతుంటారు. అలాంటి హోంగార్డుల సంక్షేమాన్ని మాత్రం అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, వైద్య చికిత్సలు, కల్యాణ మంటపాల్లో రాయితీలు ఏవీ హోంగార్డులకు లేకపోవడం శోచనీయం. కానీ విధులు మాత్రం పోలీసులతో సమానంగా చేయిస్తుండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *