Home > General > తెలియకుండానే పెరుగుతున్న పెట్రోల్

తెలియకుండానే పెరుగుతున్న పెట్రోల్

పెట్టుబడులలో తెలంగాణ భేష్
బ్రిటన్ వీసా ఉంటే 177 దేశాల్లో ప్రయాణించవచ్చు

petrol-apduniaరెండు, మూడు రూపాయలు పెరిగితే అమ్మో అంటాం.. అదే రోజూ 10, 20, 30 పైసలు పెంచుకుంటూ పోతే నొప్పి ఉండదు. ఎంత పెరిగిందో తెలుసుకునేలోపు రేటు మారిపోతుంది. రోజూ మారే ధరే కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. పెట్రోల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. బహిరంగ మార్కెట్ అనుగుణంగా మారుతున్న ధరలతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ 75 రూపాయలకు దగ్గరలో ఉంది. జస్ట్ 59పైసలు మాత్రమే తక్కువ. సెప్టెంబర్ 13 (బుధవారం) లీటర్ పెట్రోల్ రూ.74.41 ఉంది. డీజిల్ రూ.63.69 ఉంది.జూలై ఒకటో తేదీన ఇదే లీటర్ పెట్రోల్ రూ.66.93, డీజిల్ రూ.58.09గా ఉంది. రెండు నెలల్లో పెట్రోల్ ఏడున్నర రూపాయలు, డీజిల్ ఐదున్నర రూపాయలు పెరిగింది. ప్రతి రోజూ కనీసంగా పైసా నుంచి 15 పైసల వరకు పెరుగుతూ ఉంది. గతంలో అయితే 15 రోజులకోసారి రూపాయి, రెండు రూపాయలు పెరుగుతూ ఉండేది. ఈ లెక్కలు తీసుకుంటే వినియోగదారుడికి కొత్త విధానం లాభంగానే ఉందంటున్నారు ఇంధన లీడర్స్. ఒక్కసారి పెరిగే 2, 3 రూపాయలను 15 రోజులు భరించాల్సి వచ్చేదని.. ఇప్పుడు పెరిగిన ధరను పైసల్లో మాత్రమే చెల్లిస్తున్నారని చెబుతున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలను చూస్తుంటే.. లీటర్ పెట్రోల్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *