Home > Vanitha > అతి చిన్న కండలరాణి

అతి చిన్న కండలరాణి

కళే ప్రాణం పొసింది...
వ‌రుడ్ని వైద్యపరీక్షలకు పంపిన వ‌ధువు

3 girl_apduniaఇరవయ్యేళ్ల ఈ కండలరాణి సాధించిన ఘనత ఆసియా ఖండంలోనే మొదటిది. అతిచిన్న వయసులో కండలు పెంచడమే కాకుండా.. వాటితో ఓ రికార్డు సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నది. చైనాకు చెందిన ఈ కండలరాణి పేరు టు మెంగ్లి. ప్రతిరోజూ ఎక్సర్‌సైజులు చేసున్నది. రోజుకు పది కోడిగుడ్లు తప్పకుండా తింటున్నది. చైనాలోని చెంగ్డూ యూనివర్సిటీలో చదువుతున్న ఈ అమ్మాయి 51వ ఆసియా స్థాయి బాడీబిల్డిండ్, ఫిట్‌నెస్ చాంపియన్‌షిప్ పోటీలో బంగారు పతకం సాధించింది. 26 ఆసియా దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో తన కండలతో అందరినీ వెనక్కి నెట్టేసి బంగారు పతకాన్ని ఒడిసి పట్టుకున్నది. జూనియర్స్ కోటాలో స్వర్ణం సాధించిన ఈ అమ్మాయి క్రమం తప్పకుండా రోజూ ఉదయం ఆరుగంటలకే జిమ్‌లో ఉంటది. డైట్ విషయంలో అస్సలు రాజీ పడదు. పండ్లు, కూరగాయలు, ఎగ్‌వైట్, చికెన్ లాంటి పోషక పదార్థాలు రెగ్యులర్‌గా తీసుకుంటున్నది. కేవలం 48 కిలోల బరువు మాత్రమే ఉన్న టూ శారీరక ధృడత్వంలో మాత్రం ఇద్దరు సామాన్యులతో సమానం అంటూ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రకటించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *