Home > General > కౌంటర్‌ ఇచ్చిన స్మృతి

కౌంటర్‌ ఇచ్చిన స్మృతి

మళ్లీ ఉల్లి లొల్లి
కోడి గుడ్లతో కొత్త చిక్కులు

smjrithi-iramni-apduniaఅమెరికాలోని ప్ర‌తిష్టాత్మ‌క యూనివ‌ర్సిటీకి వెళ్లి త‌న విఫ‌ల రాజ‌కీయ జీవితం గురించి రాహుల్‌గాంధీ చెప్పుకోవ‌డం దారుణ‌మన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఆయ‌నో విఫ‌ల రాజకీయ వారసుడని విమ‌ర్శించారు. ఓ విదేశీ గ‌డ్డ‌పై దేశ ప్ర‌ధాని గురించి త‌క్కువ చేసి మాట్లాడ‌టం సహించరాని నేరమన్నారు. కుటుంబ రాజ‌కీయాల‌పై రాహుల్ వ్యాఖ్య‌ల‌ను కూడా స్మృతి తీవ్రంగా ఖండిచారు. ఇండియాలో ఇలాగే ఉంటుంద‌న్న రాహుల్ కామెంట్స్ స‌రికాద‌న్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తుల‌ను చూస్తే ఈ దేశంలో కుటుంబ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయా లేదా అన్న‌ది తెలుస్తుంద‌ని రాహుల్‌కు సూచించారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి చారిత్ర‌క విజ‌యం క‌ట్ట‌బెట్టి.. ఇండియాలో కుటుంబ పాల‌న చెల్ల‌ద‌ని ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చారని ఆమె స్పస్టం చేశారు. అంత పెద్ద వేదిక‌పై మాట్లాడుతూ.. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అరాచకంగా మారిందని రాహుల్ గాంధీ ఒప్పుకున్నారన్నారు స్మృతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *