Home > Crime > శేషాచలం నుంచి ఆగని స్మగ్లింగ్…

శేషాచలం నుంచి ఆగని స్మగ్లింగ్…

పూరీ అసిస్టెంట్ పేరుతో ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు వాడేశాడట
రెడ్ హంట్ లో వారే టార్గెట్

red sanders_apduniaశేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20మంది ఎన్ కౌంటర్ తరువాత ఒక్కసారిగా శేషాచలం పేరు మారుమ్రోగింది. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు శేషాచలం కొండలు. శేషుడు  కొలువై ఉన్న ప్రాంతం ఈ కొండలు. ఈ కొండల మధ్య నుంచే భక్తులు తిరుమలకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎర్రచందనం స్మగ్లర్లు మరింత రెచ్చిపోయి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేస్తున్నారు. ఒకటి  ప్రాణాలను పోగొట్టుకోవడం, లేక ప్రాణాలు తీయడమో చేసేస్తున్నారు. కోడిని చంపిన ఈజీగా పోలీసులను చంపేస్తున్నారు ఎర్రస్మగ్లర్లు. ఇంత జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. దట్టమైన అడవులతో ఉన్నదే శేషాచలం కొండలు. ఎటు చూసినా పచ్చగా కనిపిస్తుంటుంది. ఆసియాలోనే ఎక్కడా కనిపించని అరుదైన ఎర్రచందనం శేషాచలం సొంతం. ఎంతో విలువైన ఎర్రచందనం చెట్లు ఇక్కడ కనిపిస్తుంటాయి. అందుకే ఎర్రచందనం స్మగ్లర్ల కన్ను శేషాచలంపై పడింది. ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో శేషాచలంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు. ఎర్రచందనాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఏకంగా టాస్క్ ఫోర్స్ నే ఏర్పాటు చేసింది. ఎర్రచందనాన్ని కట్టడి చేయలేకపోతున్నారు. పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు ఇలా ఎంతమంది ఉన్నా స్మగ్లింగ్ ను మాత్రం కట్టడి చేయలేరు. తాజాగా భాకరాపేట ఘాట్ రోడ్డులోని గద్దెగూడ బండల సమీపంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. తెల్లవారుజామున ఎర్రకూలీలు తారసపడ్డారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్ళలు, గొడ్డలతో పోలీసులు, టాస్క్ ఫోర్స్ పై దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. చివరకు కొంతమంది ఎర్రకూలీలు అడవుల్లోకి పారిపోయారు. ఇద్దరు మాత్రం పోలీసులకు దొరికారు. నిందితుల నుంచి 18ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారానికి రెండురోజులు ఇలా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *