Home > World News > National > మిడ్ డే మీల్స్ లో పాము

మిడ్ డే మీల్స్ లో పాము

తాజ్‌మహల్ వద్ద పాము... టూరిస్టులు పరుగో పరుగు
ఫ్రాన్స్ అధ్యక్షుడి లైఫ్ తో సినిమా తీయోచ్చు టీచర్ ను పెళ్లి చేసుకున్న మేక్రాన్
 
MIDDY_apduniaప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇప్పటికే అనేక ఆరోపణలు, అనుమానాలు వున్నాయి. ఈ ఆరోపణలకి బలం చేకూర్చుతూ తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో మరో ఉదంతం వెలుగుచూసింది. ఫరీదాబాద్‌లోని రాజ్‌కీయ గాళ్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో మధ్యాహ్నం విద్యార్థినులకి వడ్డించే మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల కనిపించడం కలకలం రేపింది.స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు భోజనం చేసే సమయంలో వంట పాత్రలో పాము పిల్ల పడి వుండటం గమనించారు. వెంటనే మిగతా విద్యార్థినులని సైతం అప్రమత్తం చేస్తూ ఎవ్వరినీ ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు. కానీ అప్పటికే కొంతమంది విద్యార్థినులు భోజనం చేసి వుండటం, వారు వాంతులు చేసుకోవడం జరిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *