Home > Crime > తల్లిని తోసి చంపేసిన కోడుకు

తల్లిని తోసి చంపేసిన కోడుకు

చిన్నపిల్లలు పాలు తాగాలి బాబూ.. మందు కాదు..
ఖమ్మంలో ప్రేమోన్మాదం

son-murdered-mother-apduniaనవమాసాలు మోసి కని పెంచిన పేగు బంధాన్ని మరిచిపోయిన ఓ కసాయి కొడుకు కన్న తల్లిని మేడపై నుంచి తోసేసి అతి దారుణంగా చంపేశాడు. పైగా తన తల్లి ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించాడు ఆ కిరాతకుడు. అయితే అక్కడి సిసిటివి దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత సెప్టెంబర్‌లో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రాంతానికి చెందిన సందీప్ ఓ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సందీప్ తల్లి జయశ్రీకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమె నడవలేని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో సందీప్‌కు భార్యతో తరచూ గొడవలు జరుగుతుండేవి. దాంతో ఆ గొడవలకు కారణమైన తల్లిని చంపేయాలనుకున్నాడు సందీప్. సెప్టెంబర్ 27న ఉదయం 9 గంటల ప్రాంతంలో నడవలేని స్థితిలో ఉన్న తల్లిని సందీప్ బలవంతంగా మెట్లపై నుంచి ఎక్కించి నాల్గో అంతస్థుకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కిందకు తోసేసి, ఏమి తెలియనట్టుగా కిందకు వచ్చేశాడు. భవనం పైనుంచి పడిన జయశ్రీ అక్కడికక్కడే చనిపోయింది. ఇది గమనించిన పక్కింటి వారు వెంటనే సందీప్‌కు తెలిపారు. దీంతో సందీప్ వెంటనే కిందకు వెళ్లి తన తల్లిని ఎండకోసం పైకి తీసుకెళ్లానని, కానీ ఎమైందో తెలియదు సూసైడ్ చేసుకుని ఉండొచ్చని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. సందీప్ మాటలు నమ్మిన బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆమె అంత్యక్రియలు నిర్వహించేశారు. అయితే ఓ గుర్తుతెలియని వ్యక్తి తాజాగా రాజ్‌కోట్ పోలీసులకు ఓ లేఖతో పాటు ఆ రోజు ఈ ఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజీని కూడా సమర్పించాడు. దీంతో పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా మొదట బుకాయించిన తరువాత నేరాన్ని అంగీకరించాడు. తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రులకు తిప్పలేక, అదే సమయంలో ఈ విషయమై భార్యతో తరచూ గొడవలు వస్తుండటంతో తానే భవనంపై నుంచి తోసేసినట్లు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com