Home > Politics > మోడిహయంలో స్వేచ్చ లేదు : సోనియా గాంధీ

మోడిహయంలో స్వేచ్చ లేదు : సోనియా గాంధీ

21 తర్వాతే టీడీపీ తెగతెంపులు
15 ఎకరాల్లో జనసేన ప్లీనరీ

soina-gandhi-apduniaప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియా టుడే ప్రతియేటా నిర్వహించే ఒక కార్యక్రమంలో శుక్రవారం యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీ పాల్గోన్నారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీ హయంలో విపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు. మత ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయని విర్శించారు.పార్లమెంటులో విపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదని సోనియా గాంధీ అన్నారు. వాజ్ పేయి హయాంలో జరిగిన మాదిరిగా పార్లమెంటు కార్యకలాపాలు గౌరవ ప్రదంగా ఉండటంలేదని సోనియా గాంధీ విమర్శించారు. రాజకీయాల్లో ప్రజాసేవ మాత్రమే మొదటి ప్రాధాన్య అంశమని మిగతావన్నీ ఆ తరువాతేనని ఆమె అన్నారు. తన అత్త ఇందిరా గాంధీ హత్య అనంతరం తన భర్త రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అనివార్యమైందని చెప్పారు. అయితే, ఆయన కూడా కుటుంబానికి దూరమవుతారని తాను ఆందోళన చెందానని అన్నారు. భర్త రాజీవ్ గాంధీని తలచుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

బీజేపీ పాలనలో ప్రజల స్వేచ్ఛ దాడులకు గురవుతోంది. అభివృద్ధి కుంటుపడి దేశం తిరోగమనంలో పయనిస్తోంది. ప్రత్యామ్నాయ గొంతుకలను నొక్కేస్తున్నారు. మత ఘర్షణలు మరింతగా పెరిగిపోయాయి. కేవలం అధికారమే పరమావధిగా అనైతిక రాజకీయాలను ప్రదర్శిస్తున్న బీజేపీ.. స్థానిక రాజకీయాలను దెబ్బతీస్తోంది’ అని సోనియా పేర్కొన్నారు. కనీసం చట్టసభల్లో విపక్షాలు మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయని.. అలాంటప్పుడు పార్లమెంట్‌ను మూసేసి ప్రతినిధులంతా ఇళ్లకు వెళ్లొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో ఓటమి కారణాలపై స్పందించిన ఆమె అవినీతి ఆరోపణలు తమను దారుణంగా దెబ్బతీశాయన్నారు. అదే సమయంలో మోదీ చరిష్మా బీజేపీకి కలిసొచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.

కుమారుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ తాను రాహుల్ గాంధీకి సలహాలిచ్చే ప్రయత్నం చేయనన్నారు. పార్టీకి నూతన జవసత్త్వాలు తేవడానికి యువ నేతలు, సీనియర్ నేతలతో సమతుల్యత సాధించాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే అది అంత సులువు కాదని ఆమె అంగీకరించారు. అలాగే, ఈశాన్య రాష్ట్రాల శాసనసభ ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళిపోవడంపై కుడాసోనియా వివరణ ఇచ్చారు. ఆ సమయంలో రాహుల్ తన అమ్మమ్మను చూసేందుకు మూడు రోజులపాటు ఇటలీ వెళ్ళారన్నారు. తన కుమార్తె ప్రియాంక గురించి వ్యాఖ్యానిస్తూ రాజకీయాల్లోకి రావడం ప్రియాంక ఇష్టమన్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీలో ప్రియాంక ఎన్నికల ప్రచారం చేస్తున్నా.. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. తనకు ఇష్టమైతే రాజకీయాల్లోకి రావచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *