Home > Sports > శ్రీశాంత్ కు కోర్టులో ఊరట

శ్రీశాంత్ కు కోర్టులో ఊరట

నాల్గో వన్డే లో కొత్త వారికి అవకాశం
మూడో టెస్ట్ కు ప్రయోగాలు

sreeshanth-apduniaక్రికెట‌ర్ శ్రీశాంత్‌కు ఊర‌ట క‌లిగించే తీర్పు వెలువ‌రించింది కేర‌ళ హైకోర్టు. అత‌నిపై బీసీసీఐ విధించిన జీవిత‌కాల నిషేధాన్ని ఎత్తేసింది. గ‌తేడాది ఢిల్లీలోని ఓ కోర్టు కూడా స్పాట్‌ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా తేల్చిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పు త‌ర్వాత త‌నపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల‌ని శ్రీశాంత్ బీసీసీఐని కోరినా.. బోర్డు తిర‌స్క‌రించింది. దీంతో అత‌ను కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించాడు. కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినా.. బోర్డు త‌న‌ను కావాల‌ని వేధిస్తున్న‌ద‌ని పిటిష‌న్ వేశాడు. అత‌ను నిర్దోషిగా తేలినా బోర్డు ఎలా నిషేధిస్తుంది? స‌హ‌జ న్యాయాన్ని తిర‌స్క‌రించ‌డమే అవుతుంద‌ని తీర్పు సంద‌ర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. 2013లో శ్రీశాంత్‌తోపాటు ఇద్ద‌రు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చ‌వాన్‌ల‌ను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. హైకోర్టు తీర్పు త‌ర్వాత శ్రీశాంత్ ట్విట్ట‌ర్‌లో ఆనందం వ్య‌క్తంచేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *