Home > Bhakti > గ్రహణం రోజున కుడా యధావిధిగా శ్రీకాళహస్తీశ్వరాలయం

గ్రహణం రోజున కుడా యధావిధిగా శ్రీకాళహస్తీశ్వరాలయం

అప్రతిష్ట మూట కట్టుకుంటున్న బాసర ఆలయం
వరలక్ష్మీ పూజకు వేళాయెరా

lunar_apdunia గ్రహణాలు సంభవిచినపుడు భారతదేశం లోని అన్ని దేవాలయాలు మూసివేస్తే చిత్తూరు జిల్లా లో గల వాయులింగ క్షేత్రం గా పేరు గాంచిన  శ్రీకాళహస్తి ఆలయంలో  మాత్రం  భక్తులకు యధావిధిగా స్వామి, అమ్మవార్ల  దర్శనం కొనసాగుతుంది. ఇక్కడ స్వామి వారు సర్ప రూపంలో ఉన్నందున గ్రహణాలకు అతీతంగా పూజలందుకుంటున్నాడు.  రాహుకేతు పూజలు కూడా యధావిధిగా  జరుగుతాయి. అయితే గ్రహణం పట్టు, విడుపు సమయాల్లో స్వామి, అమ్మవారికి మూడు కాలాల పాటు  ప్రత్యేకంగా గ్రహణ కాలభిషేకం నిర్వహిస్తారు.  మకరరాశిలో చంద్రగ్రహణం పట్టడం వలన ఉత్తరాషాఢ, శ్రవణం,  ధనిస్ట నక్షత్రం వారు గ్రహణాన్ని చూడకూడదని ఆలయ వేద పండితులు మారుతీ శర్మ చెప్పారు. ఈ గ్రహణం రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాల పై ప్రభావం చూపుతున్నందున  ఉలవలు, ఎరుపువస్త్రం, బియ్యం, వెండి సర్ప ప్రతిమను దానం చేస్తే ఉపశమనం లభిస్తుందని   సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *