Home > Editorial > జీఎస్టీకి సిద్ధమౌతున్న రాష్ట్రాలు

జీఎస్టీకి సిద్ధమౌతున్న రాష్ట్రాలు

ఫసల్‌ బీమా పథకం భరోసా
ఖతర్ ఆర్ధిక దిగ్భంధనానికి వెనుక రహస్య అజెండా

gst arun_apduniaజిఎస్‌టి జూలై 1 నుంచి అమలవుతుందని, వాయిదాపడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక పరోక్ష పన్నుల విధానం సవ్యంగా అమలయ్యేందుకు కావాల్సిన చర్యలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయని నొక్కిచెప్పింది. మరో వైపు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని కొందరు జిఎస్‌టి అమలును వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా సైతం నెల రోజులపాటు జిఎస్‌టిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జిఎస్‌టి అమలుపై అనుమానాలు, వదంతులు చేలరేగగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘ఈ ఏడాది జూలై 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ బోర్డు సమన్వయంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు జిఎస్‌టిపై అవగాహన కల్పిస్తున్నాం. వారి సందేహాలను నివృత్తి చేస్తున్నామని కేంద్రం తేల్చి చెప్పింది. జిఎస్‌టి అమలుపై ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఎవరూ కూడా మరెవరినీ ఈ విషయంలో తప్పుదోవపట్టించరాదని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన జిఎస్‌టి మండలి ఇప్పటికే 1,200లకుపైగా వస్తువులపై, 500ల సర్వీసులపై జిఎస్‌టి రేటును నిర్ణయించింది కూడా. ఈ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. 5, 12, 18, 28 శ్లాబుల్లో అన్నింటికీ పన్ను వేశారు. వీటిపై కొన్ని రంగాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సదరు పన్నులను మళ్లీ తగ్గించారు. ఇంకొన్నింటికి పన్ను మినహాయింపులిచ్చారు. అయితే బంగారం పై మాత్రం ప్రత్యేకంగా 3 శాతం పన్ను విధించారు.జూలై 1 నుంచి జిఎస్‌టి అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రెవిన్యూ కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. జిఎస్‌టి అమలును వాయిదా వేయాలని తాము కేంద్రాన్ని అడగలేదన్నారు. ఇప్పటికే 80 శాతం జిఎస్‌టిలోకి మారామన్నారు. త్వరలోనే మిగతా 20 శాతం కూడా పూర్తవుతుందని, వచ్చే నెల 1 నుంచి నూతన పరోక్ష పన్నుల విధానం ప్రకారం పన్ను వసూళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు.ముడి పొగాకుపై 5 శాతం జిఎస్‌టి వద్దని, దీనికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఇతర పంటల మాదిరిగానే పొగాకుపైనా పన్ను వేయరాదన్నాయి. జిఎస్‌టి పన్నుతో పొగాకు ధరలు పడిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల నష్టపోయేది రైతులేనన్నాయి. ఈ నెల 18న జిఎస్‌టి కౌన్సిల్ మరోసారి సమావేశమవుతున్నందున అందులో తమ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరింది. 18న లాటరీ పన్నులు, ఈ-వే బిల్లు అంశాలను జిఎస్‌టి కౌన్సిల్ పరిగణనలోకి తీసుకోనుంది. ‘పొగాకు పంటపై విధించిన 5 శాతం జిఎస్‌టిని, తురిమిన, ఎండిన పొగాకుపై వేసిన 28 శాతం జిఎస్‌టిని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లోని రైతులు తమ ఉత్పత్తిని మార్కెట్లలోకి తీసుకురాకూడదని నిర్ణయించారు జిఎస్‌టి అమల్లోకి వస్తే చాలా రకాల కీలక ఔషధాల ధరలు పెరగనున్నాయి. మిక్కిలి ప్రధాన ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం 12 శాతం జిఎస్‌టిని విధించడంతో జూలై 1 నుంచి ఆయా ఔషధాల ధరలు 2.29 శాతం వరకు పెరిగే వీలుంది. ప్రస్తుతం వీటిపై దాదాపు 9 శాతం పన్ను మాత్రమే అమల్లో ఉంది. అయితే ఇన్సూలిన్ తదితర కొన్ని ఔషధాల ధరలు మాత్రం తగ్గనున్నాయి. ఇంతకుముందు వీటిపైనా 12 శాతం పన్నును వేయాలని ప్రతిపాదించినప్పటికీ, దాన్ని 5 శాతానికి తగ్గించారు.ట్రాక్టర్ విడిభాగాలన్నింటిపైనా జిఎస్‌టి పన్ను రేటును తగ్గించాలని, కొన్నింటిపైనే తగ్గించడంపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు ట్రాక్టర్ తయారీదారులు. జిఎస్‌టి కారణంగా ఒక్కో ట్రాక్టర్ ఉత్పాదక వ్యయం 25,000 రూపాయల వరకు పెరుగుతోందని ట్రాక్టర్ తయారీదారుల సంఘం (టిఎమ్‌ఎ) టెక్నికల్ కమిటీ చైర్మన్ టిఆర్ కేశవన్ తెలిపారు. ఫలితంగా ట్రాక్టర్ తయారీ పరిశ్రమపై 1,600 కోట్ల రూపాయల భారం పడుతోందన్నారు. ఇంజిన్లు, ట్రాన్స్‌మిషన్లు, ఇతరత్రా కీలక భాగాలపై 28 శాతం జిఎస్‌టి ఉందని, కొన్నింటిపై మాత్రమే 18 శాతానికి తగ్గించారు. యాక్సెల్స్, సెంటర్ హౌసింగ్, ఫ్రంట్, రేర్ టైర్లు, ట్యూబులు, ఇతరత్రా ముఖ్య భాగాలపైనా పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలంటూ రెవిన్యూ శాఖను కోరారు.చమురు, గ్యాస్ పరిశ్రమపై జిఎస్‌టి ప్రతికూల ప్రభావం చూపనుందని ఓ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత పన్ను విధానం, జిఎస్‌టి విధానం రెండూ కూడా ఈ రంగానికి వర్తించనున్నాయని పేర్కొంది. వంటగ్యాస్ (ఎల్‌పిజి), నాఫ్తా, కిరోసిన్, ఇతరత్రా చమురు ఇంధనాలకు జిఎస్‌టి వర్తిస్తుందని చెప్పింది. దీంతో రెండు రకాల పన్నుల మధ్య చమురు, గ్యాస్ పరిశ్రమ ఇబ్బందులకు గురయ్యే వీలుందంది. దేశీయ రిటైల్ మార్కెటింగ్ దిగ్గజాలన్నీ సమావేశమయ్యాయి. జిఎస్‌టి అమలు క్రమంలో ధరల విధానం, లాభాలు, ఇతరత్రా అంశాలపై ఫ్యూచర్ గ్రూప్, ట్రెంట్ హైపర్‌సిటి, డిమార్ట్, ఆదిత్యా బిర్లా రిటైల్ తదితర పనె్నండుకుపైగా సంస్థలు మంగళవారం ముంబయిలో చర్చించాయి. భారతీయ రిటైలర్ల సంఘం (ఆర్‌ఎఐ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై పన్ను విషయంలో స్పష్టత ఇవ్వాలన్న పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *