Home > Editorial > విద్యకు నాలుగు శాతం కూడా కేటాయించని రాష్ట్రాలు

విద్యకు నాలుగు శాతం కూడా కేటాయించని రాష్ట్రాలు

కిందకి దిగి రానంటున్న కూరల ధరలు
ఎవరికి ఆపద్బంధు?

education-commission-196466-1-638_apduniaచాలా రాష్ట్రాలు స్కూలు పిల్లలకు తరగతి గదులు, టీచర్లు వంటి అవసరాలను కూడా పట్టించు కోకుండా మౌలిక సౌకర్యాల విషయంలో బాగా వెనుకబడి ఉన్నాయని ఢిల్లీలోని జాతీయ ప్రభుత్వ ఆర్థిక, విధాన వ్యవహారాల సంస్థ కుండ బద్దలు కొట్టింది. స్థూల దేశీయ ఉత్పత్తిలో 3.9శాతంగా రికార్డు అయింది. స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యారంగానికి వ్యయం ఆరుశాతం ఉండాలని డియస్ కొఠారి సారథ్యంలోని భారతీయ విద్యా కమిషన్ సూచించింది. అయితే అది కూడా తక్కువేనని 2009లో ఎన్‌ఐపిఎఫ్‌పి సంస్థ అధ్యయనం తేల్చింది. విద్యారంగానికి, ముఖ్యంగా ప్రాథమిక విద్యావ్యవస్థ కు నిధులను పెంచే విషయం కేంద్రం ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. 12 రాష్ట్రాల బడ్జెట్‌లను, పాఠశాల విద్యకు సంబంధించిన ప్రభుత్వ సమా చారాన్ని విశ్లేషించి ఆ సంస్థ నివేదిక సమర్పించింది. బీహార్‌లో తరగతి గదుల కొరత ఎంత తీవ్రంగా ఉందంటే- ఇంకా 73.13 శాతం ప్రభుత్వబడుల్లో తరగతి గదుల నిర్మాణం జరగలేదు. ప్రధాన అధ్యాపకుల గదుల కొరత 232 శాతం ఉంది. అలాగే 1నుంచి 8వ తరగతిదాకా పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ల కొరత కూడా భారీగా ఉంది. ఇంకా 7,91,614 మంది టీచర్ల అవసరం ఉంది. ప్రస్తుతం 47.2 శాతం మంది టీచర్లే ఉన్నారు. 2009 విద్యా హక్కు చట్టం నిర్దేశించిన నియమాలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యకు అనుసరిస్తున్న ఇతర మార్గ దర్శకాల ప్రకారం ఆ రాష్ట్రప్రభుత్వం ప్రతి ఒక్క స్కూలు విద్యార్థిపై రూ.18,029 ఖర్చుపెట్టాలి. అయితే ప్రస్తుతం పెడుతున్న ఖర్చు రూ.5,595 మాత్రమే.ఒడిశా కూడా పాఠశాల విద్యకు పిల్లలపై తలసరి ఖర్చు పెట్టాల్సిన దానిలో కేవలం సగం మాత్ర మే ఖర్చుపెడుతూ బీహార్ తరహాలోనే వెనుకబడి ఉంది. మధ్యప్రదేశ్ మాత్రం బీహార్, ఒడిశా రాష్ట్రాల కంటే తలసరిన కొద్దిగానే ఎక్కువ ఖర్చుపెడుతోంది. పాఠశాలల్లో విద్యార్థుల చేరికను, టీచర్ల వేతనాలను కూడా పరిగణనలోకి తీసుకుని విద్యలో రాష్ట్రాలు కనీస ప్రమాణాలను అందుకోవడానికి ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి అన్నది ఎన్‌ఐఇఎఫ్‌పి సంస్థ అంచనా వేసింది. తరగతిగదులు ఇంకా ఎన్ని నిర్మించాలి, టీచర్లను ఇంకా ఎంతమందిని తీసుకోవాలి అన్నది ఆ సంస్థ అంచనా వేసి గణాంకాలు వివరించింది. ప్రస్తుతం పరిశీలన జరిపిన 12 రాష్ట్రాలలో తమిళనాడు మినహా ఇతర రాష్ట్రాలు తలసరిన విద్యార్థిపై పెట్టాల్సిన ఖర్చు విషయంలో బాగా వెనుకబడ్డాయని సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2015-16లో పెట్టిన ఖర్చును ఈ అధ్యయనానికి ప్రాతిపదికగా తీసుకున్నారు. రాష్ట్రాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచడంలో తేడాపాడా లున్నట్లు సంస్థ తేల్చింది. టీచర్ల వేతనాలు, పని పరిస్థితులు కూడా పరిశీలించారు. చట్టం అమలుకు 2010 నుండి ఐదేళ్లపాటు రూ.1,82,000 బడ్జెట్ కేటాయింపులు ప్రతిపాదించారు. అయితే ఈ కేటాయింపులు ఏ మార్పులను ఉద్దేశించి చేశారో వాటిని ప్రతి ఏడాది కొనసాగించాలని నియమం పెట్టుకోలేదని సర్వే నివేదిక తప్పుపట్టింది. ప్రాథమిక విద్య స్థాయిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో అదనంగా టీచర్ల నియామకం జరగాలి. ఒడిశా అదనంగా 21.74శాతం రాజస్థాన్ 15.55 శాతం, ఢిల్లీ 25.1శాతం అదనపు తరగతి గదులను నిర్మించాలి. ప్రధాన ఉపాధ్యాయులకు ప్రత్యేక గదులు కూడా చాలినన్ని ఆయా రాష్ట్రాల్లో లేవు. ఒడిశా (203.14శాతం), కర్నాటక (198.67శాతం), తమిళనాడు (176.73శాతం) ఇటువంటి గదులు అదనంగా నిర్మించాల్సి ఉంది. ఈ 12 రాష్ట్రాల్లోను బీహార్‌లో పాఠశాల విద్యకు మౌలిక సౌకర్యాల కొరత అత్యధికంగా ఉంది. విద్యార్థుల చేరికకు ప్రభుత్వ స్కూళ్లను, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలను ప్రాతి పదికగా తీసుకున్నారు. ‘స్కూలు బయట విద్యార్థుల’ సంఖ్యను కూడా లెక్కించారు. పెట్టాల్సిన ఖర్చులో పిసరంతే వ్యయం.తరగతి గదుల వంటి ప్రతి ఒక్క అదనపు వనరు కల్పించడానికి అయ్యే ఖర్చును కూడ ఎన్‌ఐపిఎఫ్‌పి సంస్థ లెక్కించింది. అదేవిధంగా టీచర్‌కు ఎంత వేతనం ఇవ్వాలన్నది కూడా లెక్కగట్టారు. గణాంకాల ప్రకారం ఆ రాష్ట్రప్రభుత్వం ఎంత అదనం గా ఖర్చుపెట్టాలన్నది సూచించారు. సర్వేలో పరిశీల నకు అత్యంత అవసరమైన మౌలిక సౌకర్యాలనే పరిగణనలోకి తీసుకున్నారు. వాటిలో మరుగుదొడ్లు వంటివి కూడా చేర్చలేదు. అవి కొరవడుతున్న పాఠ శాలలు మరింత అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అత్యంత అవసరమైన సౌకర్యాలనే పరిశీలనలోకి తీసు కున్నప్పటికీ ఆయా రాష్ట్రప్రభుత్వాలు పెట్టాల్సిన ఖర్చు కన్నా ఎంత తక్కువగా వెచ్చిస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఉదాహరణకు 2015-16లో బీహార్ రూ.41,261కోట్లు ప్రాథమిక విద్యా రంగంలో ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం రూ.12, 803 కోట్ల రూపాయలనే ఖర్చుపెట్టింది. అలాగే జార్ఖండ్ స్కూళ్లకు మొత్తం రూ.10,202కోట్లు అవసర పడగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.4,473కోట్లే ఖర్చుపెట్టింది.మధ్యప్రదేశ్ స్కూళ్లకు రూ.22,258 కోట్లు అవసరపడగా, రాష్ట్రప్రభుత్వం ఖర్చుపెట్టినది రూ.11, 502కోట్లే. విద్యాప్రమాణాలు నిలబెట్టడానికి తగినంత నిధులు ఖర్చుపెడుతున్న రాష్ట్రం తమిళనాడు ఒక్కటే. అనేక రాష్ట్రాల స్థూల దేశీయ ఉత్పత్తి(జిడిపి)లో విద్యారంగానికి పెడుతున్న ఖర్చు శాతం వుండాల్సి నంత లేదని తేలింది. తమిళనాడులో ఈ శాతం పెరగాల్సిన అవసరం లేనేలేదు. అయితే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్నాటక ఈ వ్యయాన్ని పెంచాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యే ఎక్కువ కాబట్టి అక్కడ ఈ వ్యయం పెంచే అవకాశం అంతగా లేదు.బడ్జెట్, పరిపాలన, జవాబుదారీతనం వ్యవహా రాల కేంద్రం 2016 సంవత్సరానికి సమర్పించిన నివేదిక ప్రకారం దేశంలో విద్యపై కేంద్రంనుండి రాష్ట్రాలకు ఈ విషయంలో సహాయం కూడా పెరగాలని వారు అంటున్నారు. అదనపు సౌకర్యాలకు అయ్యే వ్యయా న్ని ఆయా రాష్ట్రాలు స్వయంగా అంచనా వేయాలని, దేశం మొత్తానికి అయ్యే వ్యయం లెక్కించడంవల్ల ప్రయోజనం లేదని కూడా వారు సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com