Home > Bhakti > లో బావి ప్రాంతంలో నక్షత్ర వనం

లో బావి ప్రాంతంలో నక్షత్ర వనం

ఖ‌రారైన భ‌ద్రాద్రి ఆల‌య తుది న‌మూనా..
గౌరంగబాబుకు దుర్గగుడి ఛైర్మన్ పదవి

lo bavi_apduniaశ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయానికి సమీపంలోవున్న లోబావి ప్రాంతంలో నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో నక్షత్రానికి ఒక్కోరకమైన చెట్లను నాటి ఆ నక్షత్రానికి సంబంధించినవారు పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం టెండర్లను పిలుస్తామన్నారు.రూ. 6కోట్లతో అన్నదాన మండపాన్ని నిర్మించనున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి ప్రస్తుతం ఉన్న మండపం చిన్నదిగావుందని కేవలం 300 మందికి మాత్రమే సరిపోయేలా ఉండటంతో ఎక్కువ మందికి ఒకేసారి భోజనం సరఫరా చేయడానికి వీలులేకుండా ఉంది. ఇందుకోసం 1000 మందికి ఒకేసారి భోజనం సరఫరా చేయడానికి అన్నదాన మండపాన్ని నిర్మించేందుకు రూ. 6కోట్ల కేటాయించారు. అయితే స్థల పరిశీలన పూర్తికాగానే, అయిన వెంటనే టెండర్లు పిలవనున్నారు. ఆలయానికి పక్కనే ఉన్న స్వర్ణముఖీనది మురికిగా మారిందని మున్సిపాలిటి, నీరుపారుదల శాఖ, భక్తుల సహకారంతో ప్రక్షాళన చేయడానికి కార్యాచరణ తయారు చేస్తున్నట్లు ఈవో చెప్పారు. అందరూ సహకరిస్తేనే నది ప్రక్షాళన జరుగుతుందన్నారు. ప్రధాన అర్చకుడు సంబంధం గురుకుల్ కోర్టు నుంచి ఉత్తర్వు తెచ్చుకోవడం వల్ల ఆయనకు ప్రధాన అర్చక పదవిని ఇచ్చామని ఇందులో ఎటువంటి ఆరోపణలకు తావులేదన్నారు. టిటిడి ఆధ్వర్యంలో వంద గదుల సత్రం లోబావిలో నిర్మాణం జరుగుతోందని, డిసెంబర్‌లోపు నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *