Home > Vanitha > Beauty > చర్మ సౌందర్యానికి స్ట్రా బెర్రీ

చర్మ సౌందర్యానికి స్ట్రా బెర్రీ

పనీర్ లాలీ పాప్
పాలకూర దోస...

Strawberry-Milk-face-Pack.-apduniaఎర్రని రంగుతో నోరు ఊరించే చిరు పులుపుతో ఉండే స్ట్రా బెర్రీస్ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు మరియు వేడుకల ముందు ఒకటి,రెండు స్ట్రా బెర్రీ పండ్లతో ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది. ఈ పండ్లలో చర్మాన్ని సంరక్షించే ఆల్ఫా – హైడ్రాక్సీ ఆమ్లం ఉంటుంది. ఇది మృత కణాలను తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

సగానికి కోసిన స్ట్రా బెర్రీ ని పంచదారలో పది నిమిషాల పాటు రుద్ది, దాన్ని ముఖానికి రాసుకుంటే మంచి పలితం కనపడుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. రెండు స్ట్రా బెర్రీ పండ్లను రసం తీసి దానిలో ఒక స్పూన్ తేనే,పాల మీగడ కలుపుకొని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఒక పది నిముషాలు అయిన తర్వాత ముఖంను శుభ్రంగా కడగాలి. పొడి చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ చాలా బాగుంటుంది. చాయ తక్కువ ఉన్నామని బాధ పడేవారు స్ట్రా బెర్రీ గుజ్జులో ఒక స్పూన్ పచ్చి పాలు,చిటికెడు పసుపు,ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే మీ ముఖం మంచి కళగా మారుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడటానికి కూడా ఈ ప్యాక్ సహాయపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *