Home > Editorial > గ్రామాల్లో తీవ్రంగా మంచి నీటి సమన్య

గ్రామాల్లో తీవ్రంగా మంచి నీటి సమన్య

పూర్తిగా నిలిచిపోయిన కిరోసిన్, పంచదార
కట్టుబాట్లకు, ఒప్పందాలకు విలువలు ఉండవా
 
drinking water_apduniaపాడేరు మన్యంలోని గిరిజన గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గుక్కెడు నీరు దొరక్క గిరిజనులు అల్లాడిపోతున్నారు. మంచినీటి పథకాలు ఉన్న గ్రామాల్లోనూ, లేని గ్రామాల్లోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతుండడం విశేషం. గ్రావిటీ పథకాలు పనిచేయకపోవడం, మూలకు చేరడం, బోర్లు, కుళాయిలు ఒట్టిపోవడం వంటి కారణాలతో తాగునీరు దొరకక అల్లాడుతున్న గిరిజనులు, కొండవాగులు, ఊటకుంటల్లోని కలుషిత నీటిని తాగుతూ రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ఏటా మన్యంలో నెలకొన్న నీటి ఎద్దడి శాశ్వత నివారణకు చర్యలు చేపట్టని ప్రభుత్వం ,అధికార యంత్రాంగం, కనీసం సీజన్లో తాత్కాలిక నీటి సరఫరా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.హుకుంపేట మండలం గన్నెరుపుట్టు పంచాయతీ డొంకినవలస గ్రామంలో మూలకు చేరిన గ్రావిటీపథకం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఎనిమిదేళ్ల క్రితం రూ.10 లక్షలతో నిర్మించిన ఈ పథకం మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచిందని స్థానికులు అంటున్నారు. దీంతో గ్రామంలో ఉన్న 160 కుటుంబాలు కలుషిత నీటినే తాగి రోగాల బారిన పడుతున్నారు. తాగునీటితో పాటు కనీస అవసరాల లేమితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.పాడేరు పట్టణంలోని ప్రధాన వీధుల్లో నీటి ఎద్దడి నెలకొంది. స్థానిక సుండ్రుపుట్టు వీధిలో మంచినీటి సౌకర్యం లేక, ఈ వీధిలోని సుమారు 500 కుటుంబాలు పక్క వీధుల్లో నుంచి నీటిని తెచ్చుకొంటున్నారు. పదేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునే దిక్కులేదు. ఈ వీధిలో కుళాయిలు ఉన్నా అవి అలంకారప్రాయంగానే ఉన్నాయి. కొందరు మండల పరిషత్‌ కార్యాలయం వద్దనున్న బోరు నుంచి నీటిని తెచ్చుకున్న వైనాన్ని ఎంపిడిఒతో పాటు ఆర్‌డబ్య్లుఎస్‌, ఇతర అధికారులు నిత్యం చూస్తున్నా ప్రజల నీటి కష్టాలు వారికి పట్టకపోవడం విశేషం. లోచలిపుట్టు తదితర ప్రధాన వీధుల్లో సైతం ఇదే సమస్య నెలకొంది. మండలకేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే 
ఇక మారుమూల గ్రామాల పరిస్థితి చెప్పనవసరం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *