Home > Editorial > ట్రైనీ నుంచి సీఈవో స్థాయికి ఎదిగిన చందా

ట్రైనీ నుంచి సీఈవో స్థాయికి ఎదిగిన చందా

విద్యార్ధుల్లో కొరవడుతున్న సాఫ్ట్ స్కిల్స్
కశ్మీర్ కు రాజకీయ పరిష్కారమే శరణ్యం
 
1 CHANDA KOCHAR_apduniaఒకప్పుడు ట్రైనీగా చేరారు….. ఇప్పుడు అదే బ్యాంకుకు సీఈవో స్థాయికి ఎదిగారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు. మరెన్నో ఎదురుదెబ్బలు. అయినా అదురలేదు, బెదురలేదు. ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకున్నారు. ప్రతి ఛాలెంజ్‌ను ఎదుర్కొన్నారు  సగటు తల్లిగా కుటుంబబాధ్యతలు నిర్వహిస్తూనే దేశంలో అత్యున్నతబ్యాంకును సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తున్నారు.. ఈమె చందా కొచ్చర్… ఏడాది జీతం 7 కోట్ల 85 లక్షల రూపాయలు. చేసేదీ ఉద్యోగమే. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. 33 సంవత్సరాల క్రితం….1984, ముంబై.. అప్పుడే మేనేజ్‌మెంట్ విద్యను పూర్తి చేసుకున్న 23 సంవత్సరాల యువతి ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో అడుగుపెట్టింది. అప్పటికీ మేనేజ్‌మెంట్ విద్యలో రెండు గోల్డ్‌మెడల్స్ సాధించిన అర్హత తప్ప అనుభవమేం లేదు. అందుకే ఐసిఐసిఐలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది.2009, మే.. అదే ముంబాయి, అదే ఐసీఐసీఐ. ట్రైనీగా చేరిన యువతి ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థానాలను అధిష్టించింది. రెండింటి మధ్య సుమారు రెండున్నర దశాబ్దాల వ్యత్యాసం. కానీ అదే అంకితభావం. అదే ఆమెను అత్యున్నత స్థానంలో నిలబెట్టింది.చందా కొచ్చర్‌ను బ్యాంకింగ్ రంగం ఎన్నో అవార్డులతో సత్కరించగా, భారత ప్రభుత్వం.. అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌తో గౌరవించుకుంది. ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో ఫోర్బ్స్ మ్యాగజైన్ చందా కొచ్చర్‌కు స్థానమివ్వగా, ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రతి ఏటా ప్రకటించే వ్యాపార రంగంలో ప్రభావశీలురైన మహిళల జాబితాలో 2005 నుంచి ఇప్పటివరకు చందా కొచ్చర్ టాప్ 50లో స్థానాన్ని పొందుతుండడం 2009 లో ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 20 వ స్థానం, 2010లో అదే జాబితాలో 10వ స్థానం పొందారు చందా.  ఆ అవకాశాల్నే మెట్లుగా మలుచుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ అందలాలను అధిరోహించనూ గలరు. దేశంలోని ఆర్థిక రంగ బ్యాంకులన్నీ ఇప్పుడు వారి చేతిలోనే ఉన్నాయంటే ఇది పూర్తిగా మహిళల విజయం. ముమ్మాటికీ వారి వినయశీలతకూ.. విశ్వసనీయతకూ.. వారి శక్తిసామర్ధ్యాలకూ నిదర్శనం. అలాంటి వారిలో అత్యంత ప్రభావశీల మహిళ, బ్యాంకింగ్ రంగ దిగ్గజం. ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చందాకొచ్చర్ ఒకరు. మహిళలంటే కేవలం వంటింటి కుందేళ్ళని భావించే రోజుల్లోనే వ్యాపార రంగానికే వన్నె తెచ్చారు చందా కొచ్చర్. ఎల్లలు లేని వ్యాపార ప్రపంచంలో ఎదిగేందుకు తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శ్రమను నమ్ముకుని విజయమనే మెట్లను నిర్మించుకున్నారు. తన కుటుంబబాధ్యతలు నిర్వర్తిస్తూనే.. వృత్తి ధర్మానికి న్యాయం చేస్తూ, అందరి మన్ననలు పొందుతూ అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తికిరిటాన్ని ఎగురువేశారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి బ్యాంకును లాభాల బాట పట్టించారు. 1984లో ఐసీఐసీఐ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరిన చందా ఉద్యోగ తొలినాళ్ళలో సంస్థ జౌళి, కాగితం, సిమెంటు విభాగాలలో పనిచేశారు. 1993లో కొత్తగా బ్యాంకు ప్రారంభించాలనుకున్నపుడు సంస్థ యాజమాన్యం ఈమెను సంస్థ బ్యాంకింగ్ కోర్ కమిటీకి బదిలీ చేసింది. 1994లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశారు. కొచ్చర్ పనితనాన్ని గమనించిన మేనేజింగ్ డైరెక్టర్, సి.ఈ.ఓ కె.వి. కామత్ ఆమెకు మంచి అవకాశం ఇచ్చి 1996లో డిప్యూటి జనరల్ మేనేజర్‌గా నియమించారు. 1996లో శక్తి, టెలికాం, రవాణా విభాగాలలో సంస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటైన బృందానికి నాయకత్వం వహించారు. 1998లో సంస్థ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి సాధించారు.1999లో సంస్థ ఈ-కామర్స్ విభాగాన్ని కూడా నిర్వహించారు. కొచ్చర్ నాయకత్వంలోనే సంస్థ రిటైల్ బ్యాంకింగ్‌లోకి ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామిగా నిలిచింది. 2001లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు చందా. ఈ సమయంలోనే బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది. దీంతో 2006లో డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ పదవి బాధ్యతలను చేపట్టిన కొచ్చర్.. అనంతర కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించారు. 2009లో కొచ్చరుకు చీఫ్ ఫైనాన్షియల్ 
ఆఫీసర్‌తో పాటు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. కొద్ది నెలల విరామం తర్వాత 2009 మేలో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థానాలను అధిష్టించారు. 2008-09 ఆర్థిక సంక్షోభం సమయంలో ఆమె ఏమాత్రం తన ధైర్యాన్ని కోల్పోలేదు. సంక్షోభ ప్రభావం పడకుండా ఉండేందుకు చందా 4-సి వ్యూహాన్ని సిద్ధం చేశారు. దాంతో సి.ఈ.ఓ.గా బాధ్యతలు చేపట్టిన మొదటి క్వార్టర్లోనే లాభాల్లో 30 శాతం వృద్ధి జరిగింది. ఐసీఐసీఐ బ్యాంకును రిటైల్ బిజినెస్ వైపు మళ్లించడంలో చందా కొచ్చర్ కీలక పాత్ర వహించారు. పదిమందిలో ధారాళంగా మాట్లాడి అందర్నీ ఒప్పించడంలో చందాకు ఉన్న నేర్పు ఐసిఐసీఐ బ్యాంకు ఉద్యోగిగా వృత్తిజీవితంలో ఎదిగేందుకు తోడ్పడింది.కాలేజీ రోజుల్లోనే మంచి వక్తగా పేరొందిన కొచ్చర్ పలు వక్తృత్వ పోటీల్లో పాల్గొని అవార్డులు పొందారు. ఉన్నతస్థాయిలో జరిగే కీలక చర్చలలో ఈమె సమర్థవంతంగా మాట్లాడి ప్రధాన నిర్ణయాలలో తన ముద్ర ఉండేలా చూసుకునేవారు. మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరిన సంస్థలోనే పాతికేళ్ల ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగి సంస్థకు 
ఎండీగా, సీఈఓగా ఎదిగిన అరుదైన చరిత్ర ఈమెది. చదువుకునే రోజుల్లో ఒకనాటికి ఇలాంటి అత్యున్నత స్థానానికి చేరుకోగలగని ఆమె కలలో కూడా అనుకుని ఉండరు. చందా ప్రాథమిక విద్యాభ్యాసాన్ని జోధ్‌పూర్ సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత వారు ముంబై వచ్చి స్ధిరపడ్డారు. అక్కడి జైహింద్ కళాశాలలో బి.ఎ. చదివారు. 1982లో కాస్ట్ అకౌంటెన్సీ పూర్తి చేశారు. తర్వాత జమునాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. ఈ క్రమంలోనే చందా అసమాన ప్రతిభను గుర్తించిన కళాశాల యాజమాన్యం 
గోల్డ్ మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చింది. ఏడాది కాస్ట్ అకౌంటెన్సీలో అత్యధిక మార్కులు సాధించి మరో గోల్ట్‌మెడల్‌ను సొంతం చేసుకున్నారు.2008లో ఐసీఐసీఐ బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదంలో పడింది. కారణం ఆర్థికమాంద్యం. అప్పుడే.. ఒకరోజు నేను మా బాబు స్కాష్ టోర్నమెంట్‌కు వెళ్లాను. అక్కడ నేనూహించని పరిణామం మా బ్యాంకు తిరిగి కోలుకోవడానికి కారణమైంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన చాలామంది నా దగ్గరికి వచ్చారు. వారడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానమిచ్చా. బ్యాంకు సేఫ్ హ్యాండ్స్‌లోనే ఉంది అని తిరిగి వారు మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. అది నాకు నమ్మకాన్నిచ్చింది. ఆ నమ్మకంతోనే కష్టాల్లోంచి బయటపడ్డా అని ఒక సందర్భంలో చెప్పారు చందా కొచ్చర్. చందా కొచ్చర్ బాల్యం నుంచి కూడా చదువుల్లో మేటీ. ఆమె రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నవంబర్ 17, 1961లో జన్మించారు. ఆమెకు ఒకసోదరి, ఒక సోదరుడు ఉన్నారు. చిన్నతనం నుంచి కూడా వీరి 
నిర్ణయాలను తల్లిదండ్రులు గౌరవించారు. ఉన్నతంగా ఎదిగేలా తీర్చిదిద్దారు. తమ లక్ష్యాలను తామే నిర్దేశించుకునే స్వేచ్చనిచ్చారు. కానీ అనుకోని సంఘటన రాత్రికి రాత్రే వారి జీవితాలకు కొన్ని లక్ష్యాలను ఏర్పరుచుకునే పరిస్థితిని కల్పించింది. కారణం చందా కొచ్చర్ 13 ఏళ్ల వయస్సులోనే తండ్రి గుండెపోటుతో మరణించాడు. అప్పటికి వారింకా కాళ్ల మీద బతకడానికి సిద్ధంగా లేరు. కుటుంబ బాధ్యతలన్నీ వారి తల్లి భుజాన వేసుకుంది. ఎదుగుతున్న పిల్లల చదువు, పోషణ ఆ రోజుల్లో ఒక మహిళకు చాలా కష్టం. కానీ ఆమె ఆ కష్టాలేవీ తెలియనిచ్చేది కాదు.ఎన్ని ఇబ్బందులొచ్చినా వారికి ఏ లోటూ రానివ్వలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఉండాలో అమ్మను చూసి నేర్చుకున్నాం. ఆ ఓపిక, ప్రవర్తన, మాకూ అలవడ్డాయి. కుటుంబ పోషణ కోసం ఆమె టెక్స్‌టైల్స్ నడిపేది. ఆపదొచ్చినప్పుడు ఆమె స్పందించిన తీరు, తీసుకునే 
నిర్ణయాలు మాకు ఒక పాఠంలా అనిపించింది. సమస్యలు సవాల్ చేస్తే, వాటిని ఎదుర్కొని తిరిగి సవాల్ చేసేది. ఇదంతా చేస్తున్న ఆమె ఎప్పుడూ చిరునవ్వు చెరగనివ్వలేదు. మా చదువు పూర్తయి, మా కాళ్ల మీద మేం నిలబడే వరకు మాకోసం పని చేస్తూనే ఉంది. అప్పటి వరకు తెలియదు మాకు… అమ్మలో అంత ఆత్మైస్థెర్యం ఉందని అంటారు చందా.
విలువలు, జీవితం గురించి ప్రేమతో చందా కొచ్చర్ ఓ తల్లిగా, సక్సెస్‌పుల్ ఉమెన్‌గా తన అనుభవాలను తెలుపుతూ కూతురు ఆర్తీకి రాసిన లేఖ అమె విజయాల్ని అందిపుచ్చుకున్న తీరును కళ్లముందుంచుతుంది. డియర్ ఆర్తీ,
నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉన్నది. జీవితాన్ని గెలవడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం నీలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా నీ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను, నా అనుభవాలను, వాటి నుంచి నేను నేర్చుకున్న పాఠాలను నీతో పంచుకుంటున్నా. చిన్నతనంలోనే ఎన్నో పాఠాలు నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నా. అలా అని వారేమీ నాకు వేలుపట్టి నేర్పలేదు. వారి నడవడిక, ఆదర్శాలు, విలువలు, వారి జీవితమే నాకు పాఠాలు నేర్పింది. నేను అదృష్టాన్ని నమ్ముతా.. కానీ కష్టాన్ని ఇంకా ఎక్కువ నమ్ముతా. పని, శ్రద్ధ ఈ రెండే మన జీవితంలో మనల్ని గెలిపించేవి. ప్రతి ఒక్కరూ గమ్యాల్ని నిర్దేశించుకుంటారు. ఆ గమ్యాల్ని చేరుకోవడంలో మనదైన ముద్ర వేయాలి. అప్పుడే అందరిలో మనం ప్రత్యేకంగా కనిపిస్తాం. అడ్డదారుల్లో ఒకేసారి విజయాన్ని సాధించే కంటే.. ఎక్కే ప్రతి మెట్టులో విజయాన్ని 
ఆస్వాదిస్తూ అంతిమంగా సాధించిన విజయమే ఆత్మ సంతృప్తినిస్తుందని మర్చిపోకు. జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎవరి మీదో ఆధారపడకుండా.. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నీ శక్తి మేరకు ప్రయత్నించు. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పయితే దాన్నుంచి ఒక పాఠం నేర్చుకో. అంతేగానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరుల సహాయం తీసుకోవద్దు. అది మన గమ్యాన్ని డిస్టర్బ్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *