Home > Editorial > సుప్రీం తీర్పుతో రాముడికి రామ్…రామ్..

సుప్రీం తీర్పుతో రాముడికి రామ్…రామ్..

ఇండియాలో క్యాష్ లెస్ ఎకానమీ సాధ్యమా...
కోర్టుల తీర్పుతోనైనా కళ్లు తెరవాలి

ayodhya-apduniaఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అఖిలేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ పొత్తుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ముస్లిం ఓట్లను గంపగుత్తగా అందుకోవచ్చునని ఎస్పీ, కాంగ్రెస్‌ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ ఓట్లను పరిపుష్టం చేసుకోవడం తప్ప బిజేపీకి మరో గత్యంతరం లేదు. మరో వైపు కులాన్ని, మతాన్ని ప్రస్తావించడం ద్వారా ఓట్లను అర్థించరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో అత్యున్నత న్యాయస్థానానికి ఆగ్రహం కలిగి ంచేలా ఎట్టి పరిస్థితుల్లోనూ నడుచుకోరాదని బీజేపీ తమ కార్యకర్తలను హెచ్చరిస్తున్నది.సకల జనుల ఆరాధ్య దైవం శ్రీ రామచంద్రుడికి బీజేపీ పార్టీకి అవినాభావ సంబ ంధం ఉంది. నిజానికి అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంతోనే భారతీ య జనతా పార్టీ ఎదిగింది. ఎప్పటికైనా అయోధ్యలో ఘనమైన రామాలయం నిర్మించి తీరాలన్నది ప్రతి బిజెపి కార్యకర్త కల. సంఘ్‌ పరివార్‌ కూడా తరచు ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో రామ జన్మభూమి అంశాన్ని పక్కన పెడితే బీజేపీకి మనుగడే లేదన్నది సుస్పష్టం. ఈసారి ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేకత ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 14 ఏళ్లుగా ఉత్తర ప్రదే శ్‌ లో అధికారానికి దూరంగా ఉంది. 2019లో సార్వత్రిక ఎన్నికలలో విజ యం సాధించాలంటే ఈ సారి యూపీలో కచ్చితంగా అధికార ంలోకి వచ్చి తీరాలి. అందుకు అత్యధికంగా హిందూ ఓట్లను ఆకట్టుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రామ జన్మభూమి అంశాన్ని ఏ విధంగా ప్రస్తావిం చాలన్న విష యంలో పార్టీ అగ్ర నేతలు మల్ల గు ల్లాలు పడుతున్నారు. ప్రస్తు తం రామ జన్మ భూమి – బాబ్రి మసీదు కేసు సుప్రీం కోర్టులో పెం డింగ్‌లో ఉంది. ఈ కేసు ప్రత్యేకతను గుర్తించి రోజువారీగా విచారించి చేప ట్టాలని గతంలో బిజేపి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి డిమాండ్‌ చేసి నా, అత్యున్నత ధర్మాసనం అందుకు సిద్ధంగా లేదు. మరో పక్క సంఘ్‌ పరి వార్‌ రామజన్మభూమిపై బహిరంగ చర్చలు జరిగే విధంగా తన వంతు కృషి చేస్తున్నది. బాబ్రి మసీదు ప్రాంగణంలో రాముడి విగ్రహాలు దర్శనమిచ్చిన 67వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్‌ చివర్లో సంఘ్‌ పరివార్‌, ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్‌ పెద్ద హడావుడే చేసింది. విశ్వ హిందూ పరిషత్‌ ఈ అంశాన్ని విడిచే ప్రసక్తే లేదు. వీహెచ్‌పీ అగ్ర నేతలు మాత్రం ఇప్పటికీ కోర్టు ప్రమేయం లేకుండా ఒప్పందం ద్వారా సమస్య పరిష్కారం కావాలని కోరుతు న్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి డిసెంబర్‌ 25నే అయోధ్య వెళ్ళి, వివాదాస్పద స్థలంలోని తాత్కాలిక మందిరాన్ని సందర్శించారు ఎన్నికల సందర్భంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రం దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితి. అఖిలేష్‌ యాదవ్‌ హయాంలో రాష్ట్రంలో దోపిడీలు, లూటీలు, అమాయక ప్రజల వేధింపులు పెచ్చు పెరిగాయని కమల నాథులు ప్రచారం చేపట్టారు. యూపీ పశ్చిమ ప్రాంతంలోని కైరానా ప్రాంతంలో వేలా ది మంది హిందువులను సామూహికంగా వెళ్ల గొట్టిన ఉదంతాన్ని ప్రస్తావి స్తున్నది. 2014 నుంచి కైరానా పట్టణం నుంచి బందిపోటు ముకిమ్‌ కాలాకు చెందిన గూండాల వేధింపులు, బెదిరింపులు, లూటీలను భరించలేక 346 హిందూ కుటుంబాలు వేర్వేరు ప్రాంతాలకు వలసపోయాయి. కైరానాకు చెం దిన బీజేపీ ఎంపి హుకుం సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. కైరానాలోని పరిస్థితిని సమీక్షించేందుకు 2016 జూన్‌ ప్రాంతంలోనే హుకుం సింగ్‌ ఆధ్వర్యంలో 9 మంది సభ్యుల ఉన్నత స్థాయి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కైరానా పట్టణం ఉన్న షమ్లీ జిల్లా మేజిస్ట్రేట్‌ సుర్జీత్‌ విచారణకు ఆదేశించారు. కాగా ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాల నేపథ్యంలో సమా జ్‌వాదీ పార్టీ యే ఈ విధంగా జనం సామూహికంగా వలసపోయే విధం గా పురికొ ల్పుతున్నదని బీజేపీ ఆరోపిస్తున్నది. హత్య, లూటీ, కిడ్నాప్‌ వంటి తీవ్ర నేరా లకు పాల్పడిన ముకిమ్‌ కాలా జైలులో ఉంటూనే తన గూండాలతో ఆమా యకుల వేధింపులకు పాల్పడుతున్నాడు. అసలే వేధింపులకు గురవు తున్న జనం బతికుంటే బలుసాకు తిన… వచ్చు అన్నట్లు భయం భయంగా బతుకు తున్నారు. మీడియా ముందుకు వచ్చి తమ బాధలు వ్యక్తం చేసేందుకు సిద్ధంగా లేరు. చాలా కుటుంబాలు సమీపంలోని హర్యానాలోని గ్రామాలకు మకాం మార్చేశారు. పోలీసులు కానీ, పాలనా యంత్రాంగం కానీ కైరానాలోని ఘటనలపై పెదవి విప్పడం లేదు. సామూహిక వలసలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. యూపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన వేళ ఈ అంశం పెద్ద రాజకీయ వివాదంగా మారింది. అయితే సున్నితమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. సమాజ్‌ వాదీ పార్టీలో తండ్రీ కొడుకుల గొడవనూ బీజేపీ ఎన్నికల అంశంగా మార్చేస్తున్నది. రాము డు జన్మించిన… ఈ గడ్డపై అఖిలేశ్‌ తండ్రిని పార్టీ నుంచి వెళ్లగొట్టడం, తానే చీ్‌ఫ్‌గా ప్రకటించుకోవడం దారుణమని ప్రచారంతో హోరెత్తిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎన్నికల్లో బొత్తిగా కన్పించబోదని కమలనాథులు భరో సాతో ఉన్నారు. యూపీలో ఇప్పటికే 17 వేల కిలో మీటర్లు పరివర్తన్‌ యాత్ర సాగినా ఎక్కడా నిరసన వ్యక్తం కావడం లేదని చెప్పుకుంటున్నారు. ఏమైనా బీజేపీ రామ జన్మ భూమి అంశాన్ని మాత్రం విడిచి పెట్టబోదన్నది సుస్పష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *