Home > Tirumala News > నిఘా కెమెరాలతో చిక్కుతున్నారు…

నిఘా కెమెరాలతో చిక్కుతున్నారు…

పవిత్రోత్సవాలకు అంకురార్పణం
ఒక శాస్త్రీయంగా వెంకన్న దర్శనం

cc camras_apduniaతిరుమలలో ఆధునిక టెక్నాలజీ సత్ఫలితాలిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న చిన్నారుల అపహరణ విషయంలో తిరుమలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారానే నిందితులను పట్టుకోగలిగారు. అలాగే లగేజీలు పోగొట్టుకున్న భక్తులకు తిరిగి ఇప్పించడంలోనూ సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో తిరుమలపై ఇప్పుడు భద్రత నిఘా కెమెరాల నీడలో కొనసాగుతోంది….ప్రపంచ ప్రఖ్యాత నగరమైన తిరుపతిని సురక్షిత నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం పెద్దఎత్తున ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు పోలీసుశాఖ ఉన్నతాధికారులు నగరంతో సహా అర్బన్‌జిల్లా పరిధిలో నేరాల నియంత్రణకు సోషల్‌ మీడియా టెక్నాలజీని ఉపయోగించుకునేలా అధునాతన సీసీ కెమెరా నిఘా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. తద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా కోసమే కాకుండా నేరాల దర్యాప్తులోను ఈ నిఘా కేంద్రం మరింత సమర్థంగా పనిచేస్తోంది. ఒకవైపున నేరనియంత్రణ.. మరోవైపు ప్రజల్లో నేరాలపై అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యం చేస్తుండటంతో పెద్దసంఖ్యలో తిరుపతి పోలీసు ఫేస్‌బుక్‌కు ఫాలోవర్స్‌ వెల్లువెత్తుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణతోపాటు.. నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ తిరుపతి అర్బన్‌ జిల్లా నిఘా నియంత్రణా కేంద్రం ఆధునిక సాంకేతిక వినియోగంలో యావత్‌ నవ్యాంధ్రకే ఆదర్శంగా నిలుస్తోంది. తిరుపతి ప్రాధాన్యత.. ఆలయాల నగరం.. అర్బన్‌జిల్లా పరిధిలో మరిన్ని దేవాలయాలు ఉండటం.. ప్రత్యేకించి ట్రాఫిక్‌.. ఇలా అన్నివిధాలా కీలక నగరం కావడంతో ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగేదానిలో భాగంగా.. నాలుగేళ్ల క్రితమే తొలి అడుగు పడింది. గత ఎస్పీలు అనుసరించిన విధానాలను అందిపుచ్చుకుని ప్రస్తుత ఉన్నతాధికారులు సైతం వాటిని కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఫేస్‌బుక్‌.. వాట్సప్‌.. యూట్యూబ్‌.. ఇలా 
అన్నిటినీ అందిపుచ్చుకుని కీలక కేసుల ఛేదనలో ముందంజలో నిలిచారు. తిరునగరంలో ఏటు చేసిన సీసీటీవీ పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఆన్‌లైన్‌ విధానంలో తిరుపతి పోలీస్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ అకౌంట్‌లో.. నగరంలో జరిగే ట్రాఫిక్‌ ఇబ్బందులు, ప్రమాదాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తారు. తద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తమ అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాల తీవ్రత తెలుసుకునేలా వారిని చైతన్యవంతం చేస్తున్నారు. కేవలం ఫేస్‌బుక్‌ ద్వారా చేపట్టిన కేసుల విషయంలో నవ్యాంధ్రలో తొలిస్థానంలో తిరుపతి పోలీసులు నిలవడం విశేషం.శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ సమస్యలు, దొంగతనాలు, మోసాలు తదితర సమస్యలపై తిరుపతి పోలీస్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా తమ ఫిర్యాదులను అప్‌లోడ్‌ చేయవచ్చు. వీటిపై సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ల అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదిదారుని సమాచారాన్ని సైతం పోలీసులు బహిర్గతం కాకుండా తగిన గోప్యంగా ఉంచుతారు.  పోలీస్‌ వాట్సప్‌ నెంబర్‌కు.. ప్రజలు నేరుగా సమస్యలకు సంబంధించిన చిత్రాలను పెట్టి ఫిర్యాదు చేస్తున్నారు. 
శాంతిభద్రతలు, నేరాలు, ట్రాఫిక్‌ సమస్యలు, మోసాలపై ప్రజలే చిత్రాలను తీసి నేరుగా పోలీస్‌ వాట్సప్‌కు పెడితే పోలీసు అధికారులు సదరు సమస్యపై చర్యలు తీసుకుంటారు.ఇప్పటికే వాట్సాప్‌కు ఫిర్యాదులు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఇలా వాట్సప్‌ సైతం ఆశించిన రీతిలో ఫలితాలను ఇస్తోంది.కేసుల దర్యాప్తునకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని సీసీ కెమెరా నిఘా నియంత్రణా కేంద్రం నుంచే ఆయా స్టేషన్ల పోలీసులు వినియోగించుకోవడం గమనార్హం. నిరంతరం ఇక్కడి కేంద్ర సిబ్బంది సల్పుతున్న నిరాటంక కృషి ఫలితమే ఈ కేంద్రం నవ్యాంధ్రకు మణిహారంగా.. అందరికీ ఆదర్శంగా నిలవడం. ప్రభుత్వం ప్రత్యేకించి హోంశాఖ ఏ కీలక అడుగు వేయాలన్నా తిరుపతి కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడి చే మొదలుపెట్టి ముందుకు సాగుతోందంటే ఈ కేంద్రం పనితీరు ఎంత అద్భుతంగా ఉందనేది వేరే చెప్పనక్కర్లేదు. ఇతర జిల్లాల ఉన్నతాధికారులు.. శిక్షణ ఐపీఎస్‌లు.. ఇతర ఉన్నతాధికారులు.. ప్రజాప్రతినిధులు సైతం విచ్చేసి ఈ కేంద్ర సేవలను వీక్షించి ప్రశంసించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com